Petrol and Diesel Prices Sensational : పెట్రోల్, డీజిల్ ధరలపై వస్తున్న అఫాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి

రాబోయే రెండు నుంచి మూడు నెలల కాలంలో ముడి చమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే..

Hello Telugu - Petrol and Diesel Prices Sensational

Hello Telugu - Petrol and Diesel Prices Sensational

Petrol : పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గే అవకాశం ఉన్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. రాబోయే రెండు నుంచి మూడు నెలల కాలంలో ముడి చమురు (Crude Oil) ధరలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే, దేశీయంగా ఇంధన ధరలు తగ్గించే వీలుందని ఆయన పేర్కొన్నారు. గురువారం జరిగిన ఒక సమావేశంలో మంత్రి మాట్లాడారు.

Petrol – ఇంధన భద్రతకు విస్తృత దిగుమతులు:

ప్రస్తుతం భారత్ తగినంత ముడి చమురును నిల్వ చేసుకుని ఉందని పూరి తెలిపారు. దేశంలోని ఇంధన భద్రత కోసం భారత్ అధిక దేశాల నుండి చమురు దిగుమతి చేసుకునే విధానాన్ని అవలంబిస్తోంది. గతంతో పోల్చితే భారత చమురు దిగుమతి పట్ల దృష్టి మరింత విస్తరించిందని చెప్పారు.

40 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి:

భారత్ ఇప్పుడిది వరకూ 27 దేశాల నుంచి మాత్రమే ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నదంటే, ఇప్పుడు ఆ సంఖ్య 40కు పెరిగిందని మంత్రి వివరించారు. అంతర్జాతీయ చమురు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, మార్కెట్ వృద్ధిలో 16% వాటా భారత్‌దేనని చెప్పారు. ఈ అంచనా త్వరలోనే 25 శాతానికి చేరవచ్చని కూడా పలు నివేదికలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు.

రష్యా మీద ఆధారపడటం అవసరమే:

రష్యా మీద అమెరికా విధిస్తున్న ద్వితీయ ఆంక్షల నేపథ్యంలో, పూరి స్పందిస్తూ… రష్యా ప్రపంచ చమురు ఉత్పత్తిలో సుమారు 10% వాటాను కలిగి ఉందని చెప్పారు. రష్యా నుండి సరఫరాలు నిలిపివేస్తే, ముడి చమురు ధర బ్యారెల్‌కు 120–130 డాలర్లకు ఎగబాకే అవకాశం ఉందని వివరించారు. టర్కీ, చైనా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు కూడా రష్యా నుండి చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.

దిగుమతుల స్థిరతతో ధరలు నియంత్రణలో:

గత వారం భారత్ రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేయడం వలన, అంతర్జాతీయ ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర అస్థిరత తలెత్తకుండా ఉండేందుకు విస్తృత దిగుమతులు, వ్యూహాత్మక పాలసీలు కీలకమవుతాయని ఆయన పేర్కొన్నారు.

Also Read : Today Gold Price : మల్లి దూసుకుపోతున్న పసిడి ధరలు

Exit mobile version