హైదరాబాద్ : రోజు రోజుకు ఈవీ ఆధారిత వాహనాల అమ్మకాలు భారీగా పెరగడం ఒకింత మార్కెట్ కు బలాన్ని ఇచ్చేలా చేస్తోంది. గత సెప్టెంబర్‌లో అమ్మకాలు 74% పెరిగాయి. పండుగ సీజన్ డిమాండ్, నిర్వహణ వ్యయాల పరంగా సానుకూలత, విస్తృత శ్రేణిలో లభిస్తున్న మోడల్స్ , పీఎం ఈ డ్రైవ్ వంటి పథకాలు, అలాగే రాష్ట్రాల ప్రోత్సాహక విధానాల వల్ల ఈవీలు కేవలం ఒక ప్రత్యామ్నాయం స్థాయి నుండి కొనుగోలుదారుల ప్రధాన ఎంపికగా మారుతున్నాయి. గత ఏడాది ఇదే నెలలో 18,559 యూనిట్లుగా ఉన్న ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు, ఈ ఏడాది సెప్టెంబర్‌లో దాదాపు రెట్టింపు 36,108 యూనిట్లకు చేరాయి. అదే సమయంలో, గత నెలలో మొత్తం ఈవీ అమ్మకాలు ఏకంగా 74 శాతం పెరిగి 3,33,364 యూనిట్లకు చేరుకున్నాయని ‘ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్’ తెలిపింది.
. ఈవీ పరిశ్రమ సెప్టెంబర్ 2025లో మొత్తం 1,91,497 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. సెప్టెంబర్ నెలలో అత్యధిక సంఖ్యలో ఈవీ రిటైల్ అమ్మకాలు నమోదయ్యాయి. అన్ని విభాగాల్లో కలిపి భారతదేశంలో 3,33,634 యూనిట్ల అమ్మకాలు జరిగాయి . దీనివల్ల మొత్తం వాహన విపణిలో ఈవీల వాటా ఏడాది క్రితం ఉన్న 10 శాతం నుండి సుమారు 13 శాతానికి పెరిగిందని ఎఫ్ ఏ డీఏ చీఫ్ వెల్లడించారు. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 1,83,204 నుండి 88.67 శాతం పెరిగి 2,07,314కు చేరాయి; ఇందులో బజాజ్ ఆటో , టీవీఎస్ మోటార్ కంపెనీలు వరుసగా 138.87 శాతం , 125.87 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 8.2 శాతంతో పోలిస్తే, ఈ ఏడాది సెప్టెంబర్‌లో ద్విచక్ర వాహన విభాగం మార్కెట్ వాటా 11.6 శాతానికి పెరిగింది.
