Popular Actress Rekha : ఆ పాట‌ను ఎన్న‌టికీ మ‌రిచి పోలేను – రేఖ‌

ప‌రిణీత చిత్రం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Hello Telugu - Popular Actress Rekha

Hello Telugu - Popular Actress Rekha

Rekha : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి రేఖ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. తాను ఎన్నో సినిమాలు న‌టించినా, త‌న‌కు సంబంధించిన పాట‌లు ఎన్నో ఉన్నా త‌న‌ను మాత్రం ఈ మ‌ధ్య కాలంలో మ‌న‌సును క‌దిలించిన పాట మాత్రం ఒకే ఒక్క‌టి ఉంద‌న్నారు. అది ప‌రిణీత చిత్రంలో కైసే ప‌హేలీ పాట అంటూ పేర్కొంది రేఖ‌ (Rekha). ఇందులో క‌విత్వం అద్భుతంగా ఉంద‌ని, ఈ క్రెడిట్ మాత్రం ద‌ర్శ‌కుడికి, గేయ ర‌చ‌యిత‌కు ద‌క్కుతుంద‌న్నారు.

Popular Actress Rekha Key Comments

కాగా ప్ర‌స్తుతం కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ ల‌లో కొత్త ట్రెండ్ ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే జ‌నాద‌ర‌ణ పొందిన సినిమాల‌ను తిరిగి విడుద‌ల చేస్తున్నారు. ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు. ఇందులో భాగంగా ప‌రిణీత చిత్రం పునః విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు రేఖ‌. తాను చాలా సార్లు ప‌రిణీత‌ను చూశాన‌ని, ఇందులో ఆ ఒక్క పాట త‌న మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌గా ఉంద‌న్నారు. ఈ చిత్రం విడుద‌లై 20 ఏళ్లు అవుతోంది. చూస్తే విచిత్రంగా ఉంద‌న్నారు న‌టి రేఖ‌.

ఇందులోని క్లాసిక్ ట్రాక్ కైసీ ప‌హేలీ జీవితాన్ని గుర్తు చేసేలా చేసింద‌న్నారు . ఈ పాట‌ను సునిధి చౌహాన్ హృద్యంగా పాడారు. దీనిని స్వానంద్ కిర్కిరే సాహిత్యం అందించారు. శాంతను మొయిత్రా స్వరపరిచారు. కైసీ పహేలి కేవలం పాట కాదు, అది ఒక మానసిక స్థితి, జీవితానికి ఒక రూపకం. ఈ పాట చాలా వాతావరణాన్ని కలిగి ఉంది; ఇది గత కాలాన్ని గుర్తు చేస్తుందంటూ స్ప‌ష్టం చేసింది. విచిత్రం ఏమిటంటే ప‌రిణీత మూవీలోని ఈ సాంగ్ లో న‌టించింది న‌టి రేఖ‌.

Also Read : Hero Rana Daggubati : ఈడీ విచారణకు హీరో ద‌గ్గుబాటి రానా

Exit mobile version