Rana Daggubati : బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణకు రావాలంటూ హీరోకు నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో ఇప్పటికే హాజరయ్యారు నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). మరో వైపు ఈనెల 13న విచారణకు హాజరు కానున్నారు నటి మంచు లక్ష్మి. టాలీవుడ్ కు చెందిన నటీ నటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్యూయన్సర్స్ పై కేసులు నమోదయ్యాయి.
Rana Daggubati Attend
హైదరాబాద్ తో పాటు పలు చోట్ల వీరిపై ఫిర్యాదులు అందాయి. వీరు ప్రమోషన్స్ చేయడం వల్లనే యువత పక్కదారి పడుతున్నారని, పెద్ద ఎత్తున డబ్బులను కోల్పోయారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా తమపై కేసులు నమోదు చేయడంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వాటికే తాము ప్రమోట్ చేశామని చెప్పారు. ఇందులో ఎలాంటి నిబంధనలను అధిగమించ లేదని పేర్కొన్నారు.
చట్టబద్ధంగా అనుమతించబడిన ఆన్‌లైన్ నైపుణ్యం ఆధారిత గేమ్‌లను మాత్రమే తాము ఆమోదించామని నొక్కి చెప్పారు. 2017లో తాను గుర్తించడం జరిగిందని, అలాంటి ప్లాట్‌ఫామ్‌లతో ఎటువంటి అనుబంధాన్ని నిలిపి వేసినట్లు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు . నైపుణ్యం ఆధారిత ఆటలను ఆమోదించడానికి ఒక సంస్థతో తాను చేసుకున్న ఒప్పందం ముగిసిందన్నారు. కాగా ఒప్పందం చేసుకునే ముందు అనుమతి ఉందా లేదా అన్నది చూసుకునే ప్రమోషన్ చేశానని చెప్పారు నటుడు రానా దగ్గుబాటి.
Also Read : Popular Actor Kamal Haasan : నటుడు కమల్ హాసన్ కు బెదిరింపులు
