హైదరాబాద్ : నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన నటి సమంత రుత్ ప్రభు ఓ బిడ్డకు తల్లి కాబోతోందా. అవుననే అంటున్నారు ఫ్యాన్స్. ఇందుకు సంబంధించి బేబీ బంప్స్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తను మొదట నాగార్జున కొడుకు అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. ఇద్దరికీ చెడింది. ఆ తర్వాత దర్శక, నిర్మాత రాజ్ నిడుమూరును పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి పోయారు. తను కడుపుతో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా తను నటించిన మా ఇంటి బంగారం మూవీ దుమ్ము రేపుతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఏకంగా వారం రోజుల తర్వాత రూ. 45 కోట్లు కొల్లగొట్టింది. ఇదే సమయంలో సమంత గర్భవతి కావడంతో రాజ్ నిడుమూరు సంతోషంలో మునిగి పోయాడు. తన కారణంగా తను తల్లి కాబోతున్నందుకు.
కోయంబత్తూర్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో వీరి వివాహం జరిగి ఆరు నెలలకు పైగా గడిచింది. వివిధ నివేదికల ప్రకారం, తమ జీవితంలో రాబోయే ఈ కొత్త దశ పట్ల ఈ జంట “ఎంతో సంతోషంగా” ఉంది . త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. బిడ్డ డిసెంబర్‌లో జన్మించనున్నారు. సమంత గర్భవతిగా ఉన్నట్లు స్పష్టంగా కనిపించే వీడియోలు ఆన్‌లైన్‌లో రావడంతో, ఆమె గర్భం గురించిన ఊహాగానాలు ఊపందుకున్నాయి. సమంత , రాజ్ 2025 డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా యోగా సెంటర్‌లో ఉన్న లింగ భైరవి ఆలయంలో, సన్నిహిత కుటుంబ సభ్యులు ,స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరు మొదట ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వంటి ప్రాజెక్ట్‌లలో కలిసి పనిచేశారు, ఆ తర్వాత ‘సిటాడెల్: హనీ బన్నీ’ కోసం జతకట్టారు. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి.
