Delhi Red Fort Bomb Blast : ఢిల్లీ పేలుళ్ల ఘ‌ట‌న‌పై దర్యాప్తు ముమ్మరం

సీసీ టీవీ ఫుటేజ్ ల‌ను ప‌రిశీలిస్తున్నారు

Hello Telugu - Delhi Red Fort Bomb Blast

Hello Telugu - Delhi Red Fort Bomb Blast

Red Fort : ఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ప్ర‌ధాన‌మైన ఎర్ర‌కోట (Red Fort) స‌మీపంలో భారీ ఎత్తున పేలుడు సంభ‌వించింది నిన్న‌. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృత దేహాలు చెల్లా చెదురుగా ప‌డ్డాయి. చాలా మందిని గుర్తించ లేని స్థితిలో ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. కేంద్రం అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించింది. దేశంలోని ప్ర‌ధాన రాష్ట్రాల‌కు అలర్ట్ గా ఉండాల‌ని హెచ్చరించింది. మ‌రికొన్ని చోట్ల దాడుల‌కు పాల్ప‌డే ఛాన్స్ ఉంద‌ని ఇంటెలిజెన్స్ హెచ్చ‌రించింది. ఇక ఘ‌ట‌న‌కు సంబంధించి 200 మంది అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌లను సమీక్షిస్తున్నారు. 13 మంది అనుమానితులను ప్రశ్నించారు.

Red Fort Bomb Blast

బదర్‌పూర్ సరిహద్దు నుండి సునేహ్రీ బాగ్ మసీదు పార్కింగ్ వరకు, ఔటర్ రింగ్ రోడ్ నుండి కాశ్మీర్ గేట్ ద్వారా ఎర్రకోట ప్రాంతం వరకు ఉన్న కీలక మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను నిశితంగా విశ్లేషిస్తున్నారు.
పోలీసు వర్గాల ప్రకారం, ఫుటేజ్‌లను సమీక్షించడానికి , సంఘటనకు సంబంధించిన కదలికలను గుర్తించడానికి దాదాపు 200 మంది అధికారులను నియమించారు. ఇప్పటి వరకు 13 మంది అనుమానితులను ప్రశ్నించారు. వారిలో ఉమర్‌గా గుర్తించబడిన వ్యక్తి ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధం కలిగి ఉన్నాడని సమాచారం. మరణించిన బాధితుల్లో కొంతమందిని ఇంకా గుర్తించాల్సి ఉందని ఢిల్లీ డీజీపీ వెల్ల‌డించారు. డీఎన్ఏ నివేదిక‌ల కోసం వేచి ఉన్న‌ట్లు తెలిపారు.

Also Read : Jubilee Hills By Election Polling Sensational : జూబ్లీహిల్స్ లో కొన‌సాగుతున్న పోలింగ్

Exit mobile version