Jubilee Hills By Election Polling Sensational : జూబ్లీహిల్స్ లో కొన‌సాగుతున్న పోలింగ్

భారీ ఎత్తున ఓట్లు వేస్తున్న ఓట‌ర్లు

Hello Telugu - Jubilee Hills By Election Polling Sensational

Hello Telugu - Jubilee Hills By Election Polling Sensational

Jubilee Hills : హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ (Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గం (నం. 61)లో ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రారంభ‌మైంది. ఉదయం 7 గంటల నుండి ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొన‌సాగుతుంది. ఈ ఎన్నిక‌కు సంబంధించి ఫ‌లితాన్ని ఈనెల 14వ తేదీన ప్ర‌క‌టిస్తుంది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం. జూన్ 2025లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ఈ నియోజకవర్గంలో 4.01 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. దాదాపు 2.08 లక్షల మంది పురుషులు , 1.92 లక్షల మంది మహిళా ఓటర్లు నమోదు చేసుకున్నారు. 23 నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Jubilee Hills By Election

ముగ్గురు ప్రధాన పోటీదారుల చుట్టూ కీలక పోటీలు ఏర్పడ్డాయి. దివంగత ఎమ్మెల్యే భార్య మాగంటి సునీత భారత రాష్ట్ర స‌మితి పార్టీ త‌ర‌పున పోటీ చేస్తున్నారు. మ‌రోసారి ఈ సీటును నిల‌బెట్టు కోవాల‌ని రేయింబ‌వ‌ళ్లు శ్రమించాయి ఆ పార్టీ శ్రేణులు. ఇదిలా ఉండ‌గా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున న‌వీన్ యాద‌వ్ బ‌రిలో ఉండ‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌పున లంకాల దిలీప్ రెడ్డి పోటీలో ఉన్నారు. ప్ర‌ధానంగా ఇరు పార్టీల మ‌ధ్యే పోటీ కొన‌సాగుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగే ఛాన్స్ ఉంది. ఇప్ప‌టికే అన్ని స‌ర్వే సంస్థ‌లు బీఆర్ఎస్ గెల‌వ బోతోంద‌ని ప్ర‌క‌టించాయి. కానీ ఓటింగ్ స‌ర‌ళిని బ‌ట్టి చూస్తే అందుకు భిన్నంగా పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొంటున్న‌ట్లు స‌మాచారం. మొత్తంగా ఇంకో మూడు రోజులు ఆగితే అస‌లు ఎవ‌రు విజేత అనేది తేలి పోతుంది.

Also Read : Popular Actor Dharmendra : దిగ్గ‌జ న‌టుడు ధర్మేంద్ర బ‌తికే ఉన్నాడు

Exit mobile version