RBI Online Services Growth : బ్యాంకింగ్ సేవల్లో అవకతవకలపై ఆర్బీఐ కీలక సేవలు

సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేకపోవడం గమనార్హం...

Hello Telugu - RBI Online Services Growth

Hello Telugu - RBI Online Services Growth

RBI : డిజిటల్ కాలంలో బ్యాంకింగ్‌, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలు (NBFCs), డిజిటల్ పేమెంట్ సేవలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమవుతున్నాయి. ఇవి సులభతరం అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో సేవల లోపాలు, లావాదేవీలలో పొరపాట్లు, చెల్లింపుల ఆలస్యం వంటి సమస్యలు వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేకపోవడం గమనార్హం.

ఈ తరహా సమస్యలకు పరిష్కార మార్గంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ ప్రత్యేకంగా కంప్లయింట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ (CMS) అనే ఆన్‌లైన్ ఫిర్యాదు వేదికను ప్రవేశపెట్టింది. ఈ వేదిక ద్వారా ఖాతాదారులు తమ సమస్యలను RBI దృష్టికి తీసుకెళ్లే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా సేవల లోపాలపై త్వరితగతిన స్పందనతోపాటు న్యాయసమ్మతమైన పరిష్కారాలను పొందడం సాధ్యమవుతోంది.

RBI – ఫిర్యాదు ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది:

ఫిర్యాదు చేయదగిన అంశాలు:

ఫిర్యాదులో చేర్చవలసిన సమాచారం:

తుది నిర్ణయం, అప్పీల్ ప్రక్రియ:

అంబుడ్స్‌మన్ తీర్పు ఫిర్యాదుదారుడికి అనుకూలంగా ఉంటే, సంబంధిత సంస్థ 30 రోజుల్లోగా అమలు చేయాల్సి ఉంటుంది. తీర్పు నచ్చకపోతే, రిజర్వ్ బ్యాంక్‌ అప్పీల్ అథారిటీకి నెల రోజులలోపు అప్పీల్‌ చేయవచ్చు. అక్కడి నిర్ణయం కూడా నచ్చకపోతే, కన్స్యూమర్ కోర్టు లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.

సేవలు పూర్తిగా ఉచితం:

రిజర్వ్ బ్యాంక్‌ CMS పోర్టల్ సేవలు పూర్తిగా ఉచితం. ఖాతాదారులు బ్యాంకులకు, NBFC కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి నుంచే తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. అయితే, సరైన ఆధారాలు, సాక్ష్యాలతో ఫిర్యాదు చేయడం అవసరం.

Also Read : Vande Bharat New Innovation : ‘వందే భారత్’ బయలుదేరే 15 నిమిషాల ముందు కూడా టికెట్ బుకింగ్

Exit mobile version