RBI : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో దేశీయ ప్రైవేట్ పెట్టుబడులు (క్యాపెక్స్) గణనీయంగా పెరిగే అవకాశముందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి పెట్టుబడులు 21.5% వృద్ధితో రూ.2,67,432 కోట్ల స్థాయికి చేరతాయని అంచనాలు సూచిస్తున్నాయి.
RBI Reports
2024-25లో కార్పొరేట్ పెట్టుబడులు రూ.2,20,132 కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. ‘‘ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు: 2024-25లో వృద్ధి; 2025-26 అంచనాలు’’ పేరుతో ఆగస్టు బులెటిన్‌లో ప్రచురించిన వ్యాసంలో ఆర్‌బీఐ ఈ వివరాలు వెల్లడించింది.
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ, దేశీయ కార్పొరేట్ రంగం అధిక నగదు నిల్వలు, మెరుగైన లాభదాయకత, విభిన్న రుణ వసతుల అందుబాటు వంటి అంశాలతో బలంగా ముందుకు సాగుతోందని ఆర్‌బీఐ పేర్కొంది.
ఆర్‌బీఐ విశ్లేషణలో ముఖ్యాంశాలు
మౌలిక వసతుల అభివృద్ధికి విధానపరమైన చర్యలు, నిలకడగా అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం, తగ్గిన వడ్డీ రేట్లు, సులభంగా నగదు లభ్యత వంటి అంశాలు ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.
ప్రైవేట్ పెట్టుబడుల్లో అధిక భాగం మౌలిక వసతుల రంగం వైపు మళ్లుతోంది. ముఖ్యంగా విద్యుత్ రంగం ప్రథమ స్థానంలో నిలుస్తోంది.
కొత్త ప్రాజెక్టులపై పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించడం ద్వారా వ్యవస్థలో సామర్థ్యాల విస్తరణకు, అలాగే రికవరీ ప్రాసెస్‌కు ఊతమిచ్చే ధోరణి కనిపిస్తోంది.
సవాళ్లు
అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరతలు, తగ్గిన అంతర్జాతీయ డిమాండ్ వంటి అంశాలు పెట్టుబడి సెంటిమెంట్‌ను దెబ్బతీయవచ్చని ఆర్‌బీఐ హెచ్చరించింది.
Also Read : LPG Gas Price Drop : భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
