RBI Governor : భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా (RBI Governor) తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
RBI Governor – ఆర్థిక స్థితిగతులపై ఆర్‌బిఐ గవర్నర్ వ్యాఖ్యలు
“ప్రస్తుతం ప్రపంచంలోని ఐదు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. మన దేశ ఆర్థిక వృద్ధి వేగం కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే మూడో స్థానాన్ని దక్కించుకోబోతున్నాం” అని మల్హోత్రా అన్నారు.
జూన్ త్రైమాసికంలో ట్రంప్ సుంకాల ప్రభావం ఉన్నప్పటికీ భారత జీడీపీ వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదై, గత ఐదు త్రైమాసికాల్లో అత్యధిక స్థాయికి చేరిందని ఆయన పేర్కొన్నారు.
జన్ ధన్ పథకం ప్రాధాన్యం
ఆర్థిక అభివృద్ధికి ప్రధాన మంత్రి జన్ ధన్ పథకం కీలక పాత్ర పోషిస్తోందని మల్హోత్రా గుర్తు చేశారు. సుమారు 11 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటివరకు 55 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవబడ్డాయని వెల్లడించారు.
ఈ ఖాతాల ద్వారా ప్రజలకు పొదుపు, బీమా, పెన్షన్, రుణాలు, ఇతర ఆర్థిక సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సైబర్ నేరాల నివారణ కోసం జన్ ధన్ ఖాతాదారులు వెంటనే ఈ–కేవైసీ పూర్తి చేయాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎస్‌బిఐ చైర్మన్
ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి కూడా హాజరయ్యారు. ఆయన బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మార్పులు, కస్టమర్ సౌకర్యాల విస్తరణపై దృష్టి సారించారు.
Also Read : RBI Shocking : ఆ బ్యాంకుకు 45 లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ
