Ravichandran Ashwin Interesting Comments : అభిషేక్ శ‌ర్మ‌ను అడ్డుకోవ‌డం క‌ష్టం : అశ్విన్

త‌న‌ను ఎదుర్కొనే బౌల‌ర్ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు

Hello Telugu - Ravichandran Ashwin Interesting Comments

Hello Telugu - Ravichandran Ashwin Interesting Comments

Ravichandran Ashwin : చెన్నై : భార‌త క్రికెట్ జ‌ట్టు స్టార్ స్పీన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ మెగా టోర్నీలో స్టార్ యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ దుమ్ము రేపుతున్నాడు. ఓపెన‌ర్ గా భార‌త జ‌ట్టులో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నాడు. ప్ర‌ధానంగా దాయాది పాకిస్తాన్ తో జ‌రిగిన మ్యాచ్ లో దుమ్ము రేపాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. పాక్ పేస‌ర్ తొలి ఓవ‌ర్ లో తొలి బంతికే సిక్స్ కొట్టాడు. త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు శ‌ర్మ‌. కేవ‌లం 31 బంతులు ఎదుర్కొని 74 ర‌న్స్ చేశాడు. ఈ సంద‌ర్భంగా స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ స్పందించాడు. త‌న పాడ్ కాస్ట్ ద్వారా సోమ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. రాబోయే రోజుల్లో ఇత‌ర జ‌ట్ల బౌల‌ర్లు చాలా జాగ్ర‌త్తగా ఉండాల‌ని సూచించాడు. లేక పోతే ఇబ్బందులు ప‌డ‌క త‌ప్ప‌ద‌న్నాడు. ఏ బంతి విసిరినా త‌న‌ను ఎదుర్కోవ‌డం, పెవిలియ‌న్ కు పంపించ‌డం క‌ష్ట‌మేన‌ని పేర్కొన్నాడు అశ్విన్.

Ravichandran Ashwin Praises Abhishek Sharma

అభిషేక్ శర్మ క్రికెట్ ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేయబోతున్నాడ‌ని అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై చేసిన అద్భుతమైన ఆటకు భారత మాజీ ఆల్ రౌండర్ అభిషేక్ శర్మను ప్రశంసించాడు. ఒత్తిడిలో ఉన్నప్పటికీ శర్మ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడ‌ని కొనియాడారు. ఈ 25 ఏళ్ల ఆట‌గాడు సాధించిన 74 పరుగులలో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి, ప్రత్యర్థి బౌలర్లను వరుస షాట్‌లకు గురిచేశాడు.అభిషేక్ శర్మ ఎంఎస్ ధోని తరహాలో హెలికాప్టర్ కవర్ డ్రైవ్ కొట్టాడు. అతను కొట్టిన ఐదు సిక్సర్ల గురించి అందరూ మాట్లాడుకుంటారు, కానీ నేను ఈ కవర్ డ్రైవ్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ షాట్‌లో చక్కదనం ఉందన్నాడు.

Also Read : Navratri Day-1 Interesting : శరన్నవరాత్రి మొదటి రోజు భారీగా పోటెత్తిన భక్తులు

Exit mobile version