Navratri Day-1 : దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారిని బాల త్రిపురసుందరి – శైల్పుత్రిక రూపంలో భక్తులు ఆరాధిస్తున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలోనూ దసరా నవరాత్రులు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ రోజు అమ్మవారు బాల త్రిపురసుందరి దేవిగా దర్శనం ఇస్తున్నారు.
Navratri Day-1 – బాల త్రిపురసుందరి అంటే?
పురాణోక్త సంప్రదాయం ప్రకారం శారదా నవరాత్రుల్లో తొలిరోజు అమ్మవారిని త్రిపుర సుందరీ దేవిగా పూజిస్తారు.
- ఆమె త్రిపురుని భార్య, అంటే గౌరీ దేవి స్వరూపం.
- మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ ఆమె ఆధీనంలో ఉంటాయని విశ్వాసం.
- అభయహస్తంతో, అక్షమాలతో అలంకరించిన రూపంలో దర్శనమిస్తారు.
- శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవతగానూ, షోడశ విద్యకు అధిష్టాన దేవతగానూ ప్రత్యేకత కలిగినది.
పూజా ప్రాముఖ్యత
- సత్సంతానం ప్రసాదించే దేవతగా ప్రసిద్ధి.
- జీవితంలో స్థిరత్వం, విజయాలు కలిగిస్తారని విశ్వాసం.
- పితృదోషం, చంద్రగ్రహ సంబంధ సమస్యలు తొలగుతాయి.
- భక్తుల మనస్సులో ధైర్యం, విశ్వాసం నింపబడతాయి.
- కుటుంబంలో శాంతి, ఆనందం, శ్రేయస్సు నిలిచి ఉంటాయి.
ప్రత్యేక ఆచారాలు
- రెండు నుంచి పది సంవత్సరాల బాలికలను అమ్మవారి స్వరూపంగా పూజించి కొత్త బట్టలు వేసి గౌరవించడం సంప్రదాయం.
- అమ్మవారికి పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు.
Also Read : Supreme Court Shocking : ఢిల్లీ అల్లర్ల కేసు: కార్యకర్తల బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ పోలీసులకు నోటీసు
