Ratan Tata : గుంటూరు జిల్లా – ప్రతిష్టాత్మకమైన భారతీయ కంపెనీ రతన్ టాటా మరో కీలక హబ్ కు శ్రీకారం చుట్టింది. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో బుధవారం రతన్ టాటా (Ratan Tata) ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించింది. 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ హబ్ ప్రపంచ ఆవిష్కరణ అవసరాలను తీర్చే ప్రపంచ స్థాయి స్టార్టప్ కేంద్రంగా మారనుంది. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్‌లో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ సౌకర్యాన్ని అధికారికంగా ప్రారంభించారు. అమరావతి నడిబొడ్డున ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లోతైన సాంకేతికత, కృత్రిమ మేధస్సు, స్థిరమైన , సమగ్ర ఆవిష్కరణలకు వేదికగా ఉపయోగ పడుతుందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయయుడు.
Ratan Tata New Innovation Hub
ఈ చొరవలో భాగంగా అమరావతిని క్వాంటం వ్యాలీగా మార్చేందుకు ఇప్పటికే ప్లాన్స్ రూపొందించడం జరిగిందన్నారు. ఆవిష్కరణ-ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు ఒక ప్రమాణంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కీలకంగా మారబోతోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రపంచ ప్రతిభను ఆకర్షించడం, ఆవిష్కరణ-స్నేహ పూర్వక విధానాల ద్వారా పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు., రాష్ట్రంలో అత్యాధునిక పరిశోధన, వ్యవస్థాపకత, సాంకేతికత ఆధారిత వృద్ధిని పెంపొందించడంలో ఈ కేంద్రం కీలక చోదకంగా ఉద్భవించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఏపీని ఐటీ , ఇన్నోవేషన్ , క్వాంటమ్ హబ్స్ గా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు . టాటా ఇన్నోవేషన్ హబ్ తో పెద్ద ఎత్తున జాబ్స్ వస్తాయని తెలిపారు.
Also Read : Rahul Gandhi Fired on EC : ఈసీ నిర్వాకం ఓట్ల చోరీ నిజం – రాహుల్
