Rahul Gandhi Fired on EC : ఈసీ నిర్వాకం ఓట్ల చోరీ నిజం – రాహుల్

బీహార్ లాగే దేశ వ్యాప్తంగా ప్ర‌జాగ్రహం త‌ప్ప‌దు

Hello Telugu - Rahul Gandhi Fired on EC

Hello Telugu - Rahul Gandhi Fired on EC

Rahul Gandhi : బీహార్ – కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఓట్ అధికార్ యాత్ర బీహార్ రాష్ట్రంలో చేప‌ట్టిన యాత్ర కొన‌సాగుతోంది. బుధ‌వారం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. బీహార్ లో ఎన్నిక‌ల సంఘం గంప‌గుత్త‌గా ఎలాంటి ముంద‌స్తు నోటీస్ , నోటిఫికేష‌న్ ఇవ్వ‌కుండా ఏక‌ప‌క్షంగా 65 ల‌క్ష‌ల ఓట‌ర్ల‌ను జాబితా నుంచి తొల‌గించార‌ని ఆరోపించారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. ఒక్క బీహార్ నే కాదు యావ‌త్ దేశ వ్యాప్తంగా ప్ర‌జాగ్ర‌హం చ‌వి చూడ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఇదిలా ఉండ‌గా ఆగ‌స్టు 20 త‌న తండ్రి , మాజీ దివంగ‌త ప్ర‌ధాన‌మంత్రి రాజీవ్ గాంధీ (Rahul Gandhi) జ‌యంతి. ఈ సంద‌ర్బంగా త‌న తండ్రి విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ.

Rahul Gandhi Slams EC

తాను చేప‌ట్టిన ఓట్ చోరీ యాత్ర‌కు అద్బుత‌మైన స్పంద‌న బీహార్ లో వ‌స్తోంద‌ని చెప్పారు. ఇది వాస్తవం. ‘ఎన్నికల చోరీ’ ప్రయత్నం జరుగుతోందన్న‌ది నిజం అన్నారు. బీహార్ ఒక్క‌టే కాదు యావ‌త్ దేశం దీని వైపు చూస్తోంద‌న్నారు. ఇటీవల జరిగిన కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి ఎంపి రాజీవ్ ప్రతాప్ రూడీని కూడా కాంగ్రెస్ నాయకుడు అభినందించి, కరచాలనం చేశారు. యాత్ర‌లో భాగంగాగాంధీ రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్‌తో కలిసి ఔరంగాబాద్ చేరుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నాయకుడు దీపాంకర్ భట్టాచార్యతో కలిసి బీహార్‌లోని న్యూవాడకు ర్యాలీ నిర్వహించారు. 2024 నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వ్యత్యాసాలు జరిగాయని ఆరోపిస్తూ ఆగస్టు 18న సుప్రీంకోర్టు తిరస్కరించిన పిటిషన్‌ను భాటియా ప్రస్తావించడంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు రాహుల్ గాంధీ.

Also Read : Mumbai Heavy Rains Sensational : భారీ వ‌ర్షం ముంబై అత‌లాకుత‌లం

Exit mobile version