దురంధ‌ర్-2 ఇండియన్ సినిమాకు రీసెట్ బ‌ట‌న్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ

hellotelugu-RamGopalVarma

హైద‌రాబాద్ : సంచ‌ల‌న‌, వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా మార్చి 19న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ -2 మూవీ. తొలి షో నుంచే దుమ్ము రేపుతూ దూసుకు పోతోంది. కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికే త‌ను తీసిన దురంధ‌ర్ -1 రికార్డుల‌ను తిర‌గ రాసింది. రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. దీంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు దురంధ‌ర్ కు సీక్వెల్ తీశారు. అది కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. రికార్డుల‌ను తిర‌గ రాస్తోంది. సినీ వ‌ర్గాల‌ను సైతం విస్తు పోయేలా చేసింది. ఈ సంద‌ర్బంగా సినీ ప్ర‌ముఖులు, విశ్లేష‌కులు , న‌టీ న‌టులు, ద‌ర్శ‌క నిర్మాత‌లు, సాంకేతిక నిపుణులు సైతం స్పందిస్తున్నారు.

దురంధ‌ర్ -2 సినిమాపై సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. దురంధ‌ర్ -2 అనేది కేవలం ఒక సినిమా కాదని, అది భారతీయ సినిమాకు ఒక ‘రీసెట్ బటన్’ లాంటిదని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. ఈనెల‌లో ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చిన సినిమాలన్నింటినీ విస్మరించక పోవడం చలనచిత్ర నిర్మాతలందరి మూర్ఖత్వమే అవుతుంది. ఇక నుంచి సినిమా ప‌రంగా ప్రతి ఒక్కరూ తాము రూపొందించ బోయే సినిమాలన్నింటికీ దురంధ‌ర్ -ను ఒక ప్రమాణంగా (Benchmark) తీసుకోవాలని స్ప‌ష్టం చేశాడు ఆర్జీవీ. లేదంటే, దాని ప్రచండ జ్వాలల్లో వారు కాలి బూడిదై పోవడం ఖాయం అన్నాడు.

Exit mobile version