Hydraa : హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నియమించిన హైడ్రా (Hydraa) పనితీరు రోజు రోజుకు మెరుగు పడుతోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలాలను కాపాడే పనిలో పడింది. దూకుడు పెంచింది. కబ్జాదారులు, ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ స్థలాలను, చెరువులను, పార్కులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తోంది. హైడ్రా కమిషనర్ గా ఉన్న సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఏవీ రంగనాథ్ తనదైన ముద్ర వేశారు. ఈ మేరకు ఆక్రమణకు గురైన స్థలాలను గుర్తించే పనిలో పడ్డారు. ప్రతీ సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎవరూ ఊహించని విధంగా ఫిర్యాదులు అందుతున్నాయి. బాధితులు క్యూ కడుతున్నారు. తమ ఆస్తులను రక్షించాలంటూ కోరుతున్నారు. ఇదే సమయంలో కాలనీ వాసులు సైతం ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారు.
Hydraa Updates
దీంతో హైడ్రా పనితీరు మరింత సులువుగా మారింది. కబ్జాలకు పాల్పడిన వారికి ఝలక్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు రంగనాథ్ ఆధ్వర్యంలో. ఇందులో భాగంగా హైడ్రాకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. అన్ని వయసుల వారు ఇప్పుడు మద్దతు పలుకుతున్నారు. కబ్జాల నుంచి పార్కులను విడిపించు కోవడానికి ఎన్ని అవస్థలు పడ్డామో, ఎన్ని ఏళ్లుగా పోరాడామో తలుచుకుని బాధ పడుతున్నారు. కానీ హైడ్రా రావడంతో అవన్నీ తమమ సొంతం అయ్యాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్కులు కాపాడి ప్రాణవాయువును అందించిన హైడ్రా కు ధన్యవాదాలంటూ ర్యాలీ నిర్వహించారు మూసపేటలోని ఆంజనేయ నగర్ పార్కుకు చేరుకుని స్థానికులు హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు. బోరబండ సమీపంలోని బృందావన్ కాలని లో కూడా ర్యాలీలు నిర్వహించి హైడ్రాకు మద్దతు పలికారు.
Also Read : Harish Rao Fired on Congress : సునీతను అవమానించిన కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
