Harish Rao Fired on Congress : సునీత‌ను అవ‌మానించిన కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి

ఓట‌ర్ల‌కు పిలుపునిచ్చిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

Hello Telugu - Harish Rao Fired on Congress

Hello Telugu - Harish Rao Fired on Congress

Harish Rao : హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని జూబ్లీ హిల్స్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ప్ర‌ధాన పార్టీలు పోటీ చేస్తున్న‌ప్ప‌టికీ కేవ‌లం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్యే పోరు కొన‌సాగుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో నెలకొన‌డంతో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై రోజు రోజుకు ఉత్కంఠ మ‌రింత పెరిగింది. ఈ త‌రుణంలో అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ ప్ర‌చారంలో ముందంజ‌లో కొన‌సాగుతోంది. అంద‌రి కంటే ముందే పార్టీ అభ్య‌ర్థిని ఖ‌రారు చేసింది. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ త‌రుణంలో ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను త‌మ భుజాల మీద వేసుకున్నారు బావా బామ్మ‌ర్దులు కేటీఆర్, త‌న్నీరు హ‌రీశ్ రావు (Harish Rao).

Harish Rao Slams Congress Govt

ఇక ప్ర‌చారంలో భాగంగా షేక్ పేట లోని అంబేద్క‌ర్ న‌గ‌ర్ కార్న‌ర్ మీటింగ్ లో పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. మ‌గ దిక్కు లేని మాగంటి సునీత‌ను గెలిపించు కోవాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు. గ‌త 10 ఏళ్ల బీఆర్ఎస్ పాల‌నా కాలంలో నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అభివృద్దిని చూడాల‌ని అన్నారు. 24 నెల‌ల కాంగ్రెస్ స‌ర్కార్ హ‌యాంలో ఎలాంటి అభివృద్ది జ‌రిగిందో బేరీజు వేయాల‌ని హ‌రీష్ రావు పేర్కొన్నారు. మగదిక్కు లేని ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. మాగంటి గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు వారి సతీమణికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ.

Also Read : Minister Nara Lokesh Important Visit : ఎన్డీయే త‌ర‌పున బీహార్ లో ప్ర‌చారం : లోకేష్

Exit mobile version