Rajnath Singh Important Call : జ‌గ‌న్ రెడ్డికి రాజ్ నాథ్ సింగ్ ఫోన్

ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు మ‌ద్ద‌తివ్వాలి

Hello Telugu - Rajnath Singh Important Call

Hello Telugu - Rajnath Singh Important Call

Rajnath Singh : ఢిల్లీ – కేంద్ర రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) ఉన్న‌ట్టుండి అంద‌రూ ఆశ్చ‌ర్య పోయేలా వైసీపీ చీఫ్‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ను ఎంపిక చేసిన నేపథ్యంలో మద్దతు ఇవ్వాలని జగన్ ను కోరారు. ఆయ‌న ఫోన్ చేయ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌నీయాశంగా ఉంది. విచిత్రం ఏమిటంటే కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ, ఎన్డీయే కూట‌మి ఆధ్వ‌ర్యంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు, జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ కళ్యాణ్ ల‌తో జ‌త క‌ట్టింది. అంత‌కు ముందు జ‌గ‌న్ కు స‌పోర్ట్ చేసింది. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసింది. బీజేపీ కూడా ఏపీ కూట‌మిలో భాగ‌స్వామిగా ఉంది.

Union Minister Rajnath Singh Call to YS Jagan

తాజాగా త‌మ కూట‌మి త‌ర‌పున సీపీ రాధాకృష్ణ‌న్ ను ఎంపిక చేసింది మోదీ నేతృత్వంలోని బీజేపీ. ఈ కీల‌క స‌మావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ న‌డ్డా, రాజ్ నాథ్ సింగ్, జై శంక‌ర్ ఉన్నారు. రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేయ‌డంతో ఫుల్ ఖుష్ లో ఉన్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, తమ నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని జగన్ స్పష్టం చేసినట్లు స‌మాచారం. మ‌రో వైపు సీపీ రాధాకృష్ణన్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సహా ఇండియా కూటమి లో భాగస్వాములుగా ఉన్న పార్టీల అధినేతలతో కూడా బిజెపి నేతలు మాట్లాడుతున్నారు.

మరో వైపు రాధాకృష్ణన్ ఎంపికను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు తమ తరపున వేరే అభ్యర్థిని ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యారు. సెప్టెంబ‌ర్ 9న ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

Also Read : Devineni Uma Fired on YSRCP : వైసీపీ దుష్ప్ర‌చారం దేవినేని ఆగ్ర‌హం

Exit mobile version