Devineni Uma : అమరావతి – మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు (Devineni Uma) సీరియస్ కామెంట్స్ చేశారు. పదే పదే రాజధాని అమరావతి మునిగి పోయినట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. అమరావతిలో 52 వేల కోట్లతో జరుగుతున్న నిర్మాణాలను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు బ్లూ మీడియా సహకారంతో విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో వాగులు పొంగిన దృశ్యాలను తీసుకువచ్చి అమరావతి మునిగి పోయిందంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లు పని చేయడం లేదని, కొండవీటి వాగు నీటితో పంటలు మునిగి పోయాయని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, ఇరిగేషన్ శాఖ అధికారులు వాటిని ఖండిస్తూ ఫిర్యాదులు కూడా నమోదు చేసిన విషయాన్ని దేవినేని గుర్తు చేశారు.
Devineni Uma Slams YSRCP
కంభంపాడు ప్రాంతంలో వాగులు పొంగిన దృశ్యాలను అమరావతితో కలిపి చూపించడం వైసీపీ బ్లూ మీడియా దుష్ప్రచారానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా ధైర్యం ఉంటే అమరావతి వచ్చి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చూసి వెళ్ళాలని పిలుపునిచ్చారు. అక్కడ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయో స్వయంగా పర్యవేక్షించి తెలుసు కోవాలన్నారు. కానీ తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని లేదా బెంగళూరు ప్యాలెస్‌లో సత్కారాలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టడం తప్ప వేరే పని చేయడం లేదంటూ ఉమా మహేశ్వర్ రావు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో అమరావతి రైతులపై దమనకాండ నడిపారని, వేలాది కేసులు పెట్టి జైలుకు పంపారని, పనులు ఆపేసి మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసగించారని ఆయన విమర్శించారు. 156 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితం చేసినా బుద్ది రాలేదన్నారు.
Also Read : PM Kisan Interesting Update : మీకు పీఎం కిసాన్ 20వ వాయిదా రాలేదా? అయితే ఇలా చేయండి
