Rajnath Singh : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు . అమెరికా భారత్ ను లక్ష్యంగా చేసుకుని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలు విధించడంపై తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనంతకు తానుగా పెద్దన్నగా భావిస్తున్న ట్రంప్ కావాలని భారత్ పై విషం కక్కుతున్నాడని ఆరోపించారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు. భారత్ ఎవరితో కావాలని కయ్యానికి కాలు దువ్వాలని అనుకోదన్నారు. కానీ ట్రంప్ తను సూపర్ పవర్ ప్రెసిడెంట్ గా ఫీలవుతున్నాడంటూ మండిపడ్డారు. తనను నమ్మకమైన స్నేహితుడిగా ఇప్పటి వరకు భావించామని, కానీ పవర్ ను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని, భరించే ప్రసక్తి లేదన్నారు రాజ్ నాథ్ సింగ్.
Union Defence Minister Rajnath Singh Key Comments
విచిత్రం ఏమిటంటే సబ్ కే బాస్ భారత దేశ వృద్దిని అంగీకరించ లేక పోతున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. అయినా ఏ దేశానికి ఇండియా తలవంచే ప్రసక్తి లేదని ప్రకటించాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. భారత దేశం సూపర్ పవర్ గా మారకుండా ఎవరూ ఆపలేరన్నారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుండటం చూసి ప్రపంచ శక్తులు అసూయ పడుతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అమెరికా సుంకాలను తీవ్రంగా విమర్శించారు. సీనియర్ రాజకీయ నాయకుడు తన సూటిగా చేసిన విమర్శలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సూక్ష్మమైన “సబ్కే బాస్” అనే సూచనను ఉపయోగించారు .
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, ఏ ప్రపంచ శక్తి కూడా మనం సూపర్ పవర్‌గా మారకుండా ఆపలేదంటూ నొక్కి చెప్పారు రాజ్ నాథ్ సింగ్.
Also Read : Guvvala Balaraju Shocking Comments : బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు
