Guvvala Balaraju Shocking Comments : బీజేపీలో చేరిన గువ్వ‌ల బాల‌రాజు

తాను బ‌చ్చాను కానంటూ కామెంట్స్

Hello Telugu - Guvvala Balaraju Shocking Comments

Hello Telugu - Guvvala Balaraju Shocking Comments

Guvvala Balaraju : హైద‌రాబాద్ – మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను బ‌చ్చాను కానంటూ పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన గువ్వ‌ల బాల‌రాజు (Guvvala Balaraju) ఆదివారం బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద్ర‌రావు స‌మ‌క్షంలో పార్టీ లో చేరారు. కేటీఆర్ కు బాలరాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతే తాను కుంగి పోలేదన్నారు. కానీ మీరు ఒక్కసారి ఓడిపోతే అసహనంతో ఎవరిని పడితే వాళ్లను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. గువ్వ‌లతో పాటు వంద మంది కార్య‌క‌ర్త‌లు బీజేపీలో చేరారు. ఎంపీ ల‌క్ష్మ‌ణ్ , ఎమ్మెల్సీ అంజి రెడ్డిలు మాజీ ఎమ్మెల్యేను స్వాగ‌తించారు పార్టీలో. , సిర్పూర్ ఎమ్మెల్యే శ్రీ పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు.

Guvvala Balaraju Joined in BJP

ఈ సంద‌ర్బంగా బీజేపీ అధ్య‌క్షుడు రాంచందర్ రావు ప్ర‌సంగించారు. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో త‌మ పార్టీలో చేర‌బోతున్నార‌ని బాంబు పేల్చారు. ప్ర‌జ‌లు త‌మ పార్టీపై విశ్వాసంతో ఉన్నార‌ని పేర్కొన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. అచ్చంపేట‌లో ఇక నుంచి ఎగిరే జెండా క‌మ‌లం అని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల రాజు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. త‌న గురించి చుల‌క‌న చేసి మాట్లాడ‌టం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తాను బ‌చ్చా కాన‌ని అన్నాడు. తాను త‌లుచుకుంటే గ్రామాల్లో తిర‌గ లేవంటూ వార్నింగ్ ఇచ్చాడు.

Also Read : Minister Nirmala Sitharaman Alarming : శ్రీ కృష్ణ మ‌ఠం స‌న్నిధిలో నిర్మ‌లా సీతారామన్

Exit mobile version