Coolie : దమ్మున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం కూలీ (Coolie) రిలీజ్ కాకుండానే రికార్డుల మోత మోగించింది. భారీ బడ్జెట్ తో నిర్మించింది ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. ఇదే సంస్థ రజనీకాంత్ తో జైలర్ తీసింది. ఇది వసూళ్లలో దుమ్ము రేపింది. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ముందస్తు టికెట్లు ఊహించని రీతిలో అమ్ముడు పోయాయి. ఒక్క కేరళ లోనే 2 రోజుల్లో లక్షల్లో టికెట్లు అమ్ముడు పోయాయి. ప్రపంచ వ్యాప్తంగా లెక్కలు అంచనాలకు మించి పెరిగాయి. అంతే కాదు ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో రూ. 80 కోట్లకు పైగా అమ్ముడు పోయింది కూలీ (Coolie) చిత్రం. ఇది సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. మరో వైపు కూలీతో పాటు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 అదే రోజు రానుంది.
Coolie Movie Updates
ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ కీ రోల్ పోషించాడు. ఆయనతో పాటు నాగార్జున, షాబీర్, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శ్రుతీ హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక రజనీకాంత్ సినీ కెరీర్ లో కూలీ మూవీ 171వ సినిమా ఇది కావడం విశేషం. దీనిని కూలీ చిత్రాన్ని కళానిధి మారన్ ను నిర్మించారు. అంతే కాదు ఇందులో నటించిన నటీనటులకు భారీ ఎత్తున పారితోషకం చెల్లించింది. ఇందులో దేవా పాత్ర పోషించాడు రజనీకాంత్. విశ్వసనీయ సమాచారం మేరకు ఒక్క తలైవాకే నటించినందుకు రూ. 200 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. గ్యాంగ్ స్టర్ దహా పాత్రలో నటించిన అమీర్ ఖాన్ కు రూ. 20 కోట్లు, నాగ్ సైమన్ పాత్ర కోసం రూ. 10 కోట్లు, సత్యరాజ్ కు రూ. 5 కోట్లు, కలీషా పాత్ర పోషించిన ఉపేంద్రకు రూ. 5 కోట్లు, ప్రీతి పాత్ర పోషించిన శ్రుతీ హాసన్ కు రూ. 4 కోట్లు, దర్శకుడు లోకేష్‌కు రూ. 50 కోట్లు ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది.
Also Read : Spirit Movie Schedule : సెప్టెంబర్ లో స్పిరిట్ షెడ్యూల్ స్టార్ట్


















