Rahul Gandhi Shocking Allegations : నిరుద్యోగం ఓటు చోరీతో ప్ర‌త్య‌క్ష సంబంధం

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన రాహుల్ గాంధీ

Hello Telugu - Rahul Gandhi Shocking Allegations

Hello Telugu - Rahul Gandhi Shocking Allegations

Rahul Gandhi : న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఓటు చోరీ జ‌రిగింద‌నేది వాస్త‌వ‌మ‌ని, తాము ప‌క్కా ఆధారాలు కూడా స‌మ‌ర్పించ‌డం జ‌రిగింద‌న్నారు. కానీ త‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో త‌ప్పు ప‌ట్టారు. నిరుద్యోగం ఓటు చోరీతో ప్ర‌త్య‌క్ష సంబంధం క‌లిగి ఉంద‌న్నారు రాహుల్ గాంధీ (Rahul Gandhi). ఒక ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని అధికారంలోకి వచ్చినప్పుడు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం దాని మొదటి కర్తవ్యంగా భావించాల్సి ఉంటుంద‌న్నారు. దొంగ ఓట్ల‌ను క‌ట్ట‌డి చేయ‌నంత వ‌ర‌కు నిరుద్యోగం, అవినీతి ఈ దేశంలో పెరిగి పోతూనే ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చారు . నిరుద్యోగం భారతదేశంలో యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని ఇది నేరుగా ఓటు చోరీతో ముడిపడి ఉందని అన్నారు.

Rahul Gandhi Comments

మ‌రోసారి మోదీ , బీజేపీ స‌ర్కార్ ను ఏకి పారేశార‌రు రాహుల్ గాంధీ. కానీ బిజెపి నిజాయితీగా ఎన్నికల్లో గెలవదని, వారు ఓట్లను దొంగిలించడంతో పాటు సంస్థలను నియంత్రించడం ద్వారా అధికారంలో ఉంటారని ఆరోపించారు. అందుకే ఈ దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. రోజు రోజుకు ఉద్యోగాలు తగ్గుతున్నాయి, నియామక ప్రక్రియలు కుప్పకూలి పోయాయి. యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. అందుకే ప్రతి పరీక్షా పత్రం లీక్ అవుతోంద‌ని, ప్రతి నియామకం అవినీతి కథలతో ముడిపడి ఉందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాహుల్ గాంధీ. ఓ వైపు కోట్లాది మంది యువ‌త ఉపాధి కోసం అల్లాడుతుంటే మోదీ త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌చారంపై దృష్టి సారించ‌డం దారుణ‌మ‌న్నారు.

Also Read : Popular Director Ram Gopal Varma : చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వ‌ర్మ నిర్దోషి

Exit mobile version