Ram Gopal Varma : ముంబై : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు (Ram Gopal Varma) భారీ ఊరట లభించింది. చెక్కు బౌన్స్ కేసులో ఇవాళ విచారణ చేపట్టింది ముంబై కోర్టు. ఈ మేరకు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. 2018 చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీని నిర్దోషిగా ప్రకటించింది. ఇదిలా ఉండగా వర్మ సంస్థపై చెక్ బౌన్స్ కు పాల్పడినట్లు ఫిర్యాదు దాఖలు చేసింది . ఈ కేసు లోక్ అదాలత్ ద్వారా ఆయనకు ఫిర్యాదుదారు సంస్థకు మధ్య జరిగిన విషయం పరిష్కారమైన తర్వాత ఈ కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. కోర్టు ఆదేశం ప్రకారం రాజీ మెమో దృష్ట్యా వర్మను ఈ నెల ప్రారంభంలో నిర్దోషిగా ప్రకటించారు. రాజీ మెమో అనేది న్యాయ పరమైన వివాదంలో పార్టీల మధ్య ఒక వ్రాతపూర్వక ఒప్పందం. ఇది వారి పరిష్కారం నిబంధనలను వివరిస్తుంది, దీనిని న్యాయమూర్తి నమోదు చేసి చర్య తీసుకోవాల్సి ఉంటుంది.
Ram Gopal Varma Cheque Bounce Case
జనవరి 21న జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అంధేరిలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం కింద రామ్ గోపాల్ వర్మను దోషిగా నిర్ధారించారు. మేజిస్ట్రేట్ అతనికి మూడు నెలల జైలు శిక్ష విధించి, మూడు నెలల్లోపు ఫిర్యాదుదారునికి రూ.3,72,219 చెల్లించాలని ఆదేశించారు. మేజిస్ట్రేట్ తీర్పుతో వర్మ సెషన్స్ కోర్టు ముందు క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశాడు. కాగా మునుపటి విచారణలో, చిత్రనిర్మాత ఫిర్యాదుదారు కంపెనీ ఇద్దరూ లోక్ అదాలత్ ద్వారా ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించు కోవాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ఈ విషయం పరిష్కరించబడిన తర్వాత సెషన్స్ కోర్టు రామ్ గోపాల్ వర్మను నిర్దోషిగా విడుదల చేసి అతని అప్పీల్‌ను కొట్టివేసింది.
Also Read : MP Owaisi Strong Focus : బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం ప్రచారం : ఓవైసీ
