Rahul Gandhi Strong Demand : బీహార్ కు నితీష్ కుమార్ ఏం చేశారో చెప్పాలి..?

నిప్పులు చెరిగిన ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ

Hello Telugu - Rahul Gandhi Strong Demand

Hello Telugu - Rahul Gandhi Strong Demand

Rahul Gandhi : బీహార్ : ఏఐసీసీ మాజీ చీఫ్ , ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న బీహార్ లోని కిష‌న్ గంజ్ లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. మేడ్ ఇన్ చైనాకు బదులుగా, మేడ్ ఇన్ బీహార్ అని మొబైల్ ఫోన్‌లలో రాయాలని అన్నారు. గత 20 ఏళ్లలో ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ నితీష్ కుమార్ ఎన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారో చెప్పాల‌ని నిల‌దీశారు. బీహార్‌లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి భూమి లేదని అమిత్ షా అంటున్నారని, ఈ విష‌యం త‌న‌ను ఆశ్చ‌ర్య పోయేలా చేసింద‌న్నారు రాహుల్ గాంధీ. ఎవ‌రి కోసం , ఎవ‌రి ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు మోదీ, అమిత్ షా ప్ర‌య‌త్నం చేస్తున్నారో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మోదీ, షా ఇద్ద‌రూ అబ‌ద్దాలు చెప్ప‌డంలో ఆరి తేరారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Rahul Gandhi Demand

బీహార్ రాష్ట్రంలో ఎక్క‌డా భూమి కొర‌త అనేది లేద‌న్నారు రాహుల్ గాంధీ. ఈ విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా సీఎం నితీష్ కుమార్ కు తెలుస‌న్నారు. తాము నిస్సిగ్గుగా మ‌ద్ద‌తు ఇస్తూ, వ్యాపారాల‌కు ప్రోత్సాహం క‌ల్పిస్తున్న గౌత‌మ్ అదానీకి కావాల్సినంత భూమి ఇచ్చేందుకు స‌రిప‌డా ఉంద‌న్నారు కాంగ్రెస్ అగ్ర నేత‌. ఎక‌రానికి రూ. 1 చొప్పున అదానికీ భూమి ఇచ్చారంటూ మండిప‌డ్డారు రాహుల్ గాంధీ. ఎవ‌రి క‌ళ్లు గ‌ప్పి ఇవ్వ‌న్నీ చేస్తున్నారో చెప్పాలంటూ నిల‌దీశారు . ఇదిలా ఉండ‌గా బీహార్ రాష్ట్రంలో తొలి విడ‌త ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ప్ర‌స్తుతం రెండో విడ‌త ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గాల్సి ఉంది.

Also Read : MP Kesineni Chinni Important Update : ఇళ‌య‌రాజాకు డిప్యూటీ స్పీక‌ర్ కంగ్రాట్స్

Exit mobile version