MP Kesineni Chinni Important Update : ఇళ‌య‌రాజాకు డిప్యూటీ స్పీక‌ర్ కంగ్రాట్స్

ఘ‌ణంగా స‌న్మానించిన ఎంపీ కేశినేని చిన్ని

Hello Telugu - MP Kesineni Chinni Important Update

Hello Telugu - MP Kesineni Chinni Important Update

Kesineni Chinni : విజ‌య‌వాడ : మ్యూజిక్ మ్యాస్ట్రో , రాజ్య‌స‌భ స‌భ్యుడు ఇళ‌య‌రాజాను ఘ‌నంగా స‌న్మానించారు ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ‌రాజు తో పాటు బెజ‌వాడ ఎంపీ కేశినేని నాని (చిన్ని) (Kesineni Chinni) . విజయవాడ బందర్‌ రోడ్డులోని జీఆర్టీ గ్రాండ్ హోటల్‌లో కొలువు తీరిన ఇళ‌య‌రాజాను క‌లిసి అభినందించారు. ప్ర‌త్యేకంగా స‌న్మానించారు. శాలువాతో స‌త్క‌రించారు. కొండ‌ప‌ల్లి బొమ్మ‌ను కూడా బహూక‌రించారు. ఈ సంద‌ర్బంగా విజ‌య‌వాడ లో మ్యూజిక్ కాన్స‌ర్ట్ నిర్వ‌హించినందుకు న‌గ‌ర ప్ర‌జ‌ల త‌ర‌ఫున కృత‌జ్ఞ‌తలు తెలియ చేయ‌డం జ‌రిగింద‌న్నారు డిప్యూటీ స్పీక‌ర్, ఎంపీ. భార‌తీయ సంగీతానికి ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త ఇళ‌య‌రాజాకు ద‌క్కుతుంద‌న్నారు ర‌ఘురామ కృష్ణ రాజు, కేశినేని చిన్ని.

MP Kesineni Chinni – Ilayaraja

భార‌తీయ సినీ సంగీత సామ్రాట్ గా ఆయ‌న గుర్తింపు పొందారు. వేలాది పాట‌ల‌కు స్వ‌రాలు కూర్చారు. త‌న అద్బుత‌మైన సంగీత జ్ఞానంతో వంద‌లాది సినిమాలకు ప్రాణం పోశాడు. కొన్నేళ్లుగా త‌న పాట‌ల‌తో అల‌రిస్తూ వ‌స్తున్నారు ఇళ‌య‌రాజా. సంగీతంలో త‌న‌దైన శైలిలో కీల‌క మార్పులు కూడా తీసుకు వ‌చ్చారు. ఇన్నేళ్ల ప్ర‌స్థానంలో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. ఎన్నో పుర‌స్కారాలు, అవార్డులు పొందారు, అందుకున్నారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో భార‌తీయ జ‌న‌తా పార్టీ, కేంద్ర స‌ర్కార్ అనూహ్యంగా ఇళ‌య రాజాకు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా నామినేట్ చేసింది. ఈ సంద‌ర్బంగా ఆయ‌న సంగీత క‌చేరిలు కూడా నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు.

Also Read : Minister Nara Lokesh Important Meet : కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర‌ ప్ర‌ధాన్ తో లోకేష్ భేటీ

Exit mobile version