Rahul Gandhi : బీహార్ – ఏఐసీసీ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం నుంచి బీహార్ లో ఓటర్ అధికార్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర మొత్తం 16 రోజుల పాటు కొనసాగుతుంది. యాత్రలో భాగంగా 1300 కిలోమీటర్ల మేర నడుస్తారు. ప్రజలను కలుస్తారు. ప్రధానంగా భారత రాజ్యాంగం ప్రాధాన్యత, ఓటు హక్కు, వినియోగం, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి వివరిస్తారు. ప్రజలను చైతన్యవంతం చేస్తారు. ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, దాని అనుబంధ సంస్థల నిర్వాకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. ఓట్ల చోరీకి సంబంధించి 20కి పైగా జిల్లాల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర కొనసాగుతుంది.
Rahul Gandhi Bihar Tour
ఈ ఓట్ అధికార్ యాత్ర బీహార్ రాష్ట్రంలోని ససారాంలో ప్రారంభం అవుతంది. 16 రోజుల పాటు యాత్ర ముగిసిన అనంతరం సెప్టెంబర్ 1న బీహార్ రాజధాని పాట్నాలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ భారీ సభకు భారీ ఎత్తున జనం సమీకరించే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. దారి పొడవునా భారీ ర్యాలీ చేపడతారు . ఇదిలా ఉండగా ఈ యాత్రలో ఇండియా కూటమి భాగస్వామ్య నేతలు కూడా పాల్గొంటారు. సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బీహార్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ రాహుల్ గాంధీతో పాటు ఓట్ అధికార్ యాత్రలో పాల్గొంటారు. ఆయనతో పాటు ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తారు. కాగా త్వరలోనే రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి.
Also Read : TPCC Chief Mahesh Shocking Comments : ‘కోమటిరెడ్డి’పై చర్యలకు సిఫారసు చేశాం
