Mumbai : ముంబై – భారీ వర్షాలకు ముంబైలో స్తంభించింది జనజీవనం. ముంబై (Mumbai) సిటీ, ఠాణె, పాల్ఘర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబైలో 6 గంటల్లోనే రికార్డు స్థాయిలో 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై రోడ్లపై భారీగా చేరిన ప్రవాహంలో చిక్కుకు పోయాయి బస్సులు, కార్లు, బైకులు. పట్టాలపైకి వరద నీరు చేరడంతో పలు రైళ్లను నిలిపి వేసింది సెంట్రల్ రైల్వే. 345 విమానాలు ఆలస్యంగా తిరుగుతుండగా 8 విమానాలు దారి మళ్లించారు. లోతట్టు ప్రాంతాల నుండి 400 మందికి పైగా ప్రజలను ముంబై నగర మున్సిపల్ స్కూల్‌కు తరలించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కుర్లాకే పరిమితం కాకుండా, అధిక అలల కారణంగా మిథి నది పొంగి పొర్లడంతో విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Mumbai Heavy Rains
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ , జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బంది సహాయంతో, క్రాంతి నగర్ మురికివాడల నివాసితులను ఖాళీ చేయించారు. లోతట్టు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలించారు. క్రాంతి నగర్ , కిస్మత్ నగర్, టాక్సీమెన్స్ కాలనీ, బెయిల్ బజార్ నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వానల దెబ్బకు మురుగు నీరు బయటకు వచ్చింది. చాలా చోట్ల రహదారులు పొంగి పొర్లుతున్నాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. పిల్లలు బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడ్డారు. ముందు జాగ్రత్తగా ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేట్ స్కూళ్లను బంద్ చేశారు. ఇదిలా ఉండగా ఓ వైపు ముంబైతో పాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలను కూడా వర్షాలు ముంచెత్తాయి. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Also Read : Minister Savitha Interesting : ఆదరణ -3లో మత్స్యకారులకు ప్రాధాన్యం
