పాల‌న మార్పుపై మోహ‌న్ భ‌గ‌వ‌త్ కు ఏం హ‌క్కుంది..?

నిప్పులు చెరిగిన హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే

hellotelugu-PriyankKharge

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. పాలన మార్పు గురించి వ్యాఖ్యానించడానికి ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్ ఎవరు? అని ప్రశ్నించారు. ఇది సాధ్యం కాదు, ఎందుకంటే వారు ఎన్నికల సంఘాన్ని (ఈసీ), ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను (సీఈసీ), ఓటర్ల జాబితాను, అలాగే ఫారమ్ 6 , ఫారమ్ 7లను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నార‌ని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో స్వేచ్ఛా యుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు జరుగుతాయని మీరు ఆశిస్తున్నారా? అని కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రశ్నించారు. బుధవారం బెంగళూరులో విలేకరులతో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తనను తాను ఒక ‘సాంస్కృతిక సంస్థ’గా చెప్పుకోవడాన్ని తప్పుబట్టారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆ సంస్థ అసలు స్వరూపం ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజకీయ, ఆర్థిక, రక్షణ, విదేశాంగ విధానాలకు సంబంధించిన అంశాలపై ఆర్ఎస్ఎస్ తరచుగా వ్యాఖ్యలు చేస్తుందని ఆయన ఆరోపించారు. ఫ్రాన్స్‌లో జరిగిన నిరసనలు, అల్బేనియా, నేపాల్ , బంగ్లాదేశ్‌లలోని పరిణామాలను ఉటంకిస్తూ పాలన మార్పు జరగలేదన్నారు. ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఓటర్ల జాబితా, ఫారమ్ 6 మరియు ఫారమ్ 7లను వారు తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారని మండిప‌డ్డారు. ఇలాంటి స్థితిలో భారతదేశంలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు జరుగుతాయని మీరు భావిస్తున్నారా అని నిల‌దీశారు. మరి అలాంటప్పుడు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ‘న్యాయపరమైన రక్షణ’ ఎందుకు అవసరం? దీనిపై వ్యాఖ్యానించడానికి మోహన్ భగవత్ ఎవరు? అని మండిప‌డ్డారు. ఆర్ఎస్ఎస్ అనేది సాంస్కృతిక సంస్థా లేక రాజకీయ సంస్థా అనేది వారే తేల్చుకోవాలన్నారు. దీనిపై స్ప‌ష్టత ఇవ్వాల‌న్నారు.

Exit mobile version