Rahul Gandhi Fired on EC : ఈసీ నిర్వాకంపై రాహుల్ గాంధీ ఫైర్

కర్ణాట‌క సీఐడీ డేటా నిలిపివేత త‌గ‌దు

Hello Telugu - Rahul Gandhi Fired on EC

Hello Telugu - Rahul Gandhi Fired on EC

Rahul Gandhi : న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మ‌రోసారి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. కర్ణాటక సీఐడీ డేటాను నిలిపి వేయడంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను చేసిన ఓటు చోరీ ఆరోపణలపై పోల్ ప్యానెల్ వివరాలను పంచుకోవడం లేదని ఎంపీ ఆరోపించారు. ఓట్ల తారుమారుకు సంబంధించిన వివ‌రాల‌ను ఇవ్వాల‌ని త‌మ స‌ర్కార్ విచార‌ణ‌కు సీఐడీని ఆదేశించింద‌న్నారు. ఇదే స‌మ‌యంలో కోరిన స‌మాచారాన్ని ఇచ్చేందుకు ఈసీ నిరాక‌రించ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు. ఇక్క‌డే ఈసీ త‌ప్పు చేసింద‌ని తేలి పోయింద‌న్నారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ఉన్న అనుమానాలు మ‌రింత పెరిగేలా చేశాయ‌న్నారు రాహుల్ గాంధీ.

Rahul Gandhib Slams EC

దీనిని తిర‌స్క‌రించ‌డం అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. ఇది నిజాన్ని బహిర్గతం చేసే హైడ్రోజన్ బాంబు అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. తన తల్లి సోనియా గాంధీతో కలిసి వయనాడ్ చేరుకున్న రాహుల్, ‘ఓటు చోరీ’లో ఉపయోగించిన సంఖ్యల గురించి సమాచారం కోరినా ఎందుకు స్పందించ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు ఈసీని. జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ , పోలీసులు కోరిన సమాచారాన్ని ఆయన అందించడం లేదని కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పై ఇంతకంటే పెద్ద నేరారోపణ మరొకటి ఉండదు. పోలీసులు సమాచారం అడుగుతున్నారు, కానీ ఆయన దానిని అందించడం లేదు. ఇది నా ప్రకటన కాదు. ఇది వాస్తవం అన్నారు రాహుల్ గాంధీ.

Also Read : EC Shocking New Parties : ఏపీ, తెలంగాణ‌లో 25 పార్టీల ర‌ద్దు : ఈసీ

Exit mobile version