విజ‌య్, ప్రియాంక గాంధీ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్

సోనియా గాంధీ పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌లో

hellotelugu-CM

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్ర నాయ‌కురాలు, సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియో గాంధీ త‌న ఆత్మ‌క‌థ‌ను రాశారు. ఇది దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఈ పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ న్యూఢిల్లీలో జ‌రిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నాయ‌కుల‌తో పాటు ఇండియా కూట‌మి లోని పార్టీల‌కు చెందిన అధ్యక్షులు, మాజీ సీఎంలు, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా సోనియా గాంధీకి శుభాకాంక్ష‌లు తెలిపారు. పుస్త‌కంపై కూడా చ‌ర్చించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు టీవీకే పార్టీ చీఫ్ , త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ. ఈ ఇద్ద‌రూ క‌లిసి మాట్లాడు కోవ‌డం, చ‌ర్చించ‌డం ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య పోయేలా చేసింది.

ఇదిలా ఉండ‌గా ఈ సంద‌ర్బంగా ప్రియాంక గాంధీ సీఎం విజ‌య్ కి త‌మ ఇంట్లో ప‌ని చేసే ఆమెను ప‌రిచయం చేసింది. స‌ద‌రు మహిళా ఉద్యోగి చిరకాల కోరికను నెరవేర్చారు . ప్రియాంక గాంధీ తన ఇంట్లో 22 ఏళ్లుగా పనిచేస్తున్న మహిళను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు పరిచయం చేశారు. త‌ను విజయ్‌తో కలిసి ఫోటో దిగాలని ఆ మహిళ ఎంతో కాలంగా కోరుకుంటున్నారని ప్రియాంక గాంధీ తెలిపారు. ఆ తర్వాత ఆ మహిళ ముఖ్యమంత్రితో కలిసి ఫోటో దిగారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు ఎన్. ఆనంద్ ,అథవ్ అర్జున కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Exit mobile version