సూక్ష్మ పరిశ్రమలతోనే వికసిత్ భారత్ సాకారం

రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్

hellotelugu-MPVijay

​న్యూఢిల్లీ : సూక్ష్మ ప‌రిశ్ర‌మ‌ల‌తోనే విక‌సిత్ భార‌త్ సాధ్యం అవుతుంద‌ని అన్నారు ఎంపీ చింత‌కాయ‌ల విజ‌య్. భారతీయ యువ శక్తి సామాజిక ట్రస్ట్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని షాంగ్రి-లా ఈరోస్ వేదికగా జరిగిన ‘జేఆర్‌డీ టాటా అవార్డ్స్ – 2026’ ప్రత్యేక ప్లీనరీ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. ‘సూక్ష్మ పరిశ్రమలు: వికసిత్ భారత్‌కు మార్గం’ (Micro Enterprises: Pathway to a Viksit Bharat) అనే అంశంపై జరిగిన ఈ కీలక చర్చాగోష్ఠిలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ , ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) ఛైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ , ఎన్డీటీవీ (NDTV) సీఈఓ అండ్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ కన్వల్ తో కలిసి చింతకాయల విజయ్ వేదికను పంచుకున్నారు. సూక్ష్మ పరిశ్రమల బలోపేతంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
​ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ వివిధ రంగాల‌లో అనుభ‌వం క‌లిగిన ప్ర‌ముఖ‌ల‌తో కలిసి ఈ ప్రత్యేక ప్లీనరీ సమావేశంలో పాల్గొనడం ఆనందంగా ఉంద‌న్నారు.

సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధిపై జరిగిన అర్థవంతమైన చర్చలో భాగస్వామి కావడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా తాను భావిస్తున్న‌ట్లు తెలిపారు ఎంపీ విజ‌య్. భారతదేశపు గ్రామీణ పారిశ్రామికవేత్తలను (గ్రాంప్రెన్యూర్స్) ప్రోత్సహిస్తూ అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ వేడుకను నిర్వహించిన BYST వ్యవస్థాపక మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి లక్ష్మీ వెంకటేశన్ కి, వారి బృందం మొత్తానికి నా హృదయ పూర్వక అభినందనలు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు. మరింత శక్తివంతమైన, సమ్మిళిత భారతదేశాన్ని నిర్మిస్తున్న ఈ ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తికి మద్దతుగా నిలవడం ఎంతో గర్వంగా ఉంది అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడైన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ నేతృత్వంలో భార‌త దేశం ప్ర‌పంచంలోనే అగ్ర‌గామి దేశంగా నిలుస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు ఎంపీ చింత‌కాయ‌ల విజ‌య్.

Exit mobile version