పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామం భార‌త దేశం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

hellotelugu-Kishanreddyy

న్యూఢిల్లీ : భార‌త దేశం లో అపార‌మైన వ‌న‌రులు, అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి జి. కిష‌న్ రెడ్డి. తాను ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు కేంద్ర మంత్రి. ప్రముఖ కంపెనీలను కలిసి భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి, నూతన ఆవిష్కరణలు చేయడానికి, అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను అన్వేషించమని వారిని ఆహ్వానించడం జ‌రిగింద‌ని తెలిపారు. ఆ పర్యటనకు కొనసాగింపుగ, గనుల మంత్రిత్వ శాఖ అధికారులు , ప్రముఖ లిథియం టెక్నాలజీ కంపెనీలతో ఒక సమీక్షా సమావేశం జరిగిందని పేర్కొన్నారు జి. కిష‌న్ రెడ్డి.

భారతదేశంలో లిథియం ప్లాంటును ఏర్పాటు చేయడానికి గల అవకాశాలు, మన దేశీయ కీలక ఖనిజాలు, ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంపై ఈ చర్చలు కేంద్రీకరించబడ్డాయ‌ని వెల్ల‌డించారు. భారతదేశంలో అధునాతన ఉత్పాదక సామర్థ్యాలను నిర్మించడంలో మాతో భాగస్వామ్యం కావడానికి లిథియం టెక్నాలజీ కంపెనీలను , ప్రపంచ సంస్థలను భారత ప్రభుత్వం స్వాగతిస్తోంద‌ని ఈ సంద‌ర్భంగా కిష‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కలిసికట్టుగా భారతదేశ స్వావలంబనను బలోపేతం చేద్దాం అని, ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనికతను ముందుకు తీసుకువెళ్దాం అని పిలుపునిచ్చారు . ఇదిలా ఉండ‌గా స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడైన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో విక‌సిత్ భార‌త్ ముందుకు సాగుతుంద‌న్నారు. పెట్టుబ‌డిదారులు, పారిశ్రామిక‌వేత్త‌లకు తాము రెడ్ కార్పెట్ ప‌రుస్తామ‌న్నారు గంగాపురం కిష‌న్ రెడ్డి.

Exit mobile version