R Ashwin Sensational Comments : కీవీస్ తో ఓటమే నా రిటైర్మెంట్ కు కారణం

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ర‌విచంద్ర‌న్ అశ్విన్

Hello Telugu - R Ashwin Sensational Comments

Hello Telugu - R Ashwin Sensational Comments

R Ashwin : చెన్నై : స్టార్ క్రికెట‌ర్ , స్పిన్న‌ర్ గా గుర్తింపు పొందిన ర‌విచంద్ర‌న్ అశ్విన్ (R Ashwin) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను క్రికెట్ నుంచి నిష్క్ర‌మించేందుకు ప్ర‌ధాన కార‌ణం ఉంద‌న్నాడు. గురువారం త‌ను స్వంతంగా నిర్వహిస్తున్న ఆష్ కీ బాత్ యూట్యూబ్ ఛానల్ షోలో మాట్లాడాడు. ఈ సంద‌ర్బంగా త‌న రిటైర్మెంట్ కు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నాడు. త‌ను చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఒక క్రికెట‌ర్ గా ఎంత కాలం ఆడుతామో అనేది సెలెక్ష‌న్ క‌మిటీ, హెడ్ కోచ్ , తోటి ఆట‌గాళ్ల కంటే ఆడే త‌న‌కు మాత్ర‌మే ఎక్కువ‌గా అవ‌గాహ‌న ఉంటుంద‌న్నాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్. భార‌త దేశం త‌ర‌పున అత్య‌ధిక వికెట్లు తీసుకున్న క్రికెట‌ర్ గా, ఆల్ రౌండ‌ర్ గా గుర్తింపు పొందాడు.

R Ashwin Shocking Comments on His Retirement

అంతే కాదు ర‌విచంద్ర‌న్ అశ్విన్ చెన్నై సూప‌ర్ కింగ్స్ , రాజస్థాన్ రాయ‌ల్స్ జ‌ట్ల త‌ర‌పున సుదీర్గ కాలం ఐపీఎల్ టోర్నీలో పాల్గొన్నాడు. ఇక్క‌డ కూడా స‌త్తా చాటాడు. కానీ న్యూజిలాండ్ జ‌రిగిన సీరీస్ లో భార‌త జ‌ట్టు ఓడి పోవ‌డంతో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో షాక్ ఇచ్చాడు. ఈ మేర‌కు తాను క్రికెట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్. 2012లో ఇంగ్లండ్‌తో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్‌లో ఓడిపోయిన తర్వాత నేను నాకు ఒక వాగ్దానం చేసుకున్నాను.. అదేమిటంటే, ఒకవేళ మనం మళ్లీ ఇంకెప్పుడైనా సొంతగడ్డపై టెస్ట్ సిరీస్‌ను కోల్పోతే, నేను రిటైర్ అవుతాను’ అని అశ్విన్ అన్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ ఓటమి కారణంగానే ఈ రోజు నేను ఇంట్లో కూర్చుని ఉండటానికి కారణం అని చెప్పాడు.

Also Read : Kavitha Strong Demand : రైతుల గోస వినండి న్యాయం చేయండి

Exit mobile version