PVN Madhav Shocking Comments : బీఆర్ఎస్ పార్టీ ద‌గాకోరు పార్టీ : పీవీఎన్ మాధ‌వ్

క‌ల్వ‌కుంట్ల కుటుంబం అవినీతిమ‌యం

Hello Telugu - PVN Madhav Shocking Comments

Hello Telugu - PVN Madhav Shocking Comments

PVN Madhav : అమ‌రావ‌తి – ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీపై ఆయ‌న భ‌గ్గుమ‌న్నారు. ఆ పార్టీ ద‌గాకోరు పార్టీ అంటూ మండిప‌డ్డారు. తెలంగాణ అస్తిత్వం కోసం కాదు కల్వకుంట్ల అస్తిత్వం కోసమే బీఆర్ఎస్ ఉందన్నారు.దోచుకున్న డబ్బును పంచుకోవడంలో తేడాలు రావడంతోనే గొడవలు వ‌చ్చాయ‌న్నారు. లిక్కర్ స్కాంలో ఏ విధంగా కవిత దోచుకుందో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ని మళ్ళీ తెరమీదకు తెచ్చి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని వాపోయారు. గురువారం పీవీఎన్ మాధ‌వ్ (PVN Madhav) మీడియాతో మాట్లాడారు.

PVN Madhav Slams BRS Party

ఇన్నాళ్లుగా తెలంగాణ ప్ర‌జ‌ల సెంటిమెంట్ ను ఆధారంగా చేసుకుని కేసీఆర్, ఆయ‌న కుటుంబం రాజ‌కీయాల‌కు పాల్ప‌డింద‌ని ఆరోపించారు. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌న్నారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, అందుకే త‌న రాచ‌రిక పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడార‌ని అన్నారు. అందినంత మేర దోచుకున్న చ‌రిత్ర మీది కాదా అని ప్ర‌శ్నించారు. సెంటిమెంట్ పేరుతో వేల కోట్లు వెనకేసుకున్నార‌ని మండిప‌డ్డారు పీవీఎన్ మాధ‌వ్. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కింద‌న్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు వెన‌కేసుకున్నార‌ని , ఈ స‌మ‌యంలో అక్క‌డి ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించ‌డంతో ఒక్కటొక్క‌టిగా అక్ర‌మాలు, అవినీతి బ‌య‌ట ప‌డుతోంద‌న్నారు పీవీఎన్ మాధ‌వ్.

అవినీతి గురించి తాము చెప్ప‌డం లేద‌ని, విచిత్రం ఏమిటంటే స్వ‌యంగా మాజీ సీఎం కేసీఆర్ స్వంత కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత బ‌య‌ట పెట్టింద‌న్నారు. మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులు క‌లిసిక‌ట్టుగా కాళేశ్వ‌రం పేరుతో అంతులేని సంప‌ద‌ను పొందారంటూ పేర్కొన్నార‌ని అన్నారు పీవీఎన్ మాధ‌వ్. వీరిపై విచార‌ణ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు బీజేపీ చీఫ్‌.

Also Read : Minister Gottipati Ravi Interesting Update : ఏపీ విద్యుత్ శాఖ‌లో త్వ‌ర‌లో ఖాళీల భ‌ర్తీ

Exit mobile version