హైదరాబాద్ : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న దర్శకత్వం వహిస్తున్న మూవీ వారణాసిపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ , పోస్టర్స్ పిచ్చెక్కించేలా చేస్తున్నాయి. తొలిసారిగా ఇండియన్ సెల్యూలాయిడ్ పై తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న ఘనమైన చరిత్ర జక్కన్నది. తన కెరీర్ లో వారణాసి మూవీ ఓ మైలురాయిగా ఉండబోతోందని ఇప్పటికే ప్రకటించాడు నటుడు ప్రిన్స్ మహేష్ బాబు. వారణాసి కోసం వైల్డ్‌లో మొదటి రోజు ‘ఇంటిమిడేటింగ్’ని గుర్తు చేసుకున్నాడు . ఇప్పటికే ఈ సినిమా గురించి కీలక అప్ డేట్ ఇచ్చాడు దర్శక ధీరుడు. అధికారికంగా ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది కూడా ఇప్పటికే రివీల్ చేశాడు.
వచ్చే ఏడాది 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా వారణాసిని విడుదల చేస్తామని అప్పటి వరకు వేచి చూడాలని ప్రకటించాడు రాజమౌళి. తాజాగా మహేష్ బాబు డిస్కసింగ్ ఫిల్మ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మహేష్ బాబు వారణాసి కోసం ఆఫ్రికాలోని వైల్డ్‌ల్యాండ్స్‌లో మొదటి రోజు షూటింగ్ చేసిన విషయాన్ని పంచుకున్నాడు. దీనిని మరిచి పోలేనని తెలిపాడు. 2025లో వైల్డ్‌బీస్ట్ వలస సీజన్‌లో కెన్యాలోని మాసాయి మారా వంటి ప్రాంతాలలో ఈ మాగ్నమ్ ఓపస్ చిత్రీకరించడం జరిగిందన్నాడు మహేష్ బాబు. ఆ అంశాల కోసం VFXపై ఆధార పడకుండా ఎస్ఎస్ రాజమౌళి, బృందం వాహనాల నుండి దిగి, సన్నివేశాల కోసం నిజమైన అడవి జంతువుల మధ్య నేరుగా నడవాల్సి వచ్చిందన్నాడు.
