గోదావరి వెస్ట్రన్ డెల్టాపై డీపీఆర్ రూపొందించాలి

స్ప‌ష్టం చేసిన నీటి పారుద‌ల శాఖా మంత్రి నిమ్మ‌ల‌

hellotelugu-NimmalaRamanaaidu

విజ‌య‌వాడ : గోదావరి వెస్ట్రన్ డెల్టాపై డీపీఆర్ రూపొందించాలని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామా నాయుడు. బుధ‌వారం గోదావరి డెల్టా ఆధునీకరణపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి స‌మీక్ష చేప‌ట్టారు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, గోదావరి డెల్టా సిఈ, ఎస్‌ఈ, ఐఐఎస్‌సి టెక్నాలజీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. గోదావరి డెల్టా శాశ్వత ముంపు పరిష్కారం కోసం రూ. 13.4 కోట్లతో చేసిన లైడార్ సర్వేతో డిపిఆర్ తయారు చేస్తున్నాం అన్నారు. ఇప్పుటికే ఈస్ట్రన్ డెల్టాకు 1137 కోట్లుతోనూ, సెంట్రల్ డెల్టాకు 1268 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారన్నారు. త్వరలోనే గోదావరి వెస్ట్రన్ డెల్టా అంచనాలు కూడా సిద్ధం చేసి అందించాలని, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు నిమ్మ‌ల రామానాయుడు.

కాలువలు, డ్రైన్స్, బండ్ లెవల్, డీసిల్టింగ్, లాకులు, షట్టర్ల కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
పూడుకు పోయిన సీ మౌత్ ల వద్ద, డ్రెడ్జింగ్ పనులకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
గోదావరి దిగువన ముమ్మిడి వరం, అమలాపురం, రాజోలు, నరసాపురం, భీమవరం వంటి ప్రాంతాలలో సముద్రంలో కలిసే డ్రెయిన్స్ పూడిక పై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్ప‌ష్టం చేశారు. బ్రిటీష్ కాలంలో నిర్మించి, నేడు శిధిలావస్ధకు చేరుకున్న లాకులు, అవుట్ ఫాల్ స్లూయిజ్‌ల మరమ్మత్తులు లేదా కొత్తవి నిర్మాణం పై దృష్టి పెట్టాల‌న్నారు. లైడార్ సర్వే చేసిన ఐఐఎస్‌సి టెక్నాలజీస్ సంస్ధ ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసే ముందు, స్దానిక నీటి సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధుల అనుభవాన్ని సైతం ఉపయోగించు కోవాల‌ని పేర్కొన్నారు నిమ్మ‌ల రామానాయుడు.

డిపిఆర్‌లు సిద్దం అయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి నిధులు మంజూరుకు ప్రయత్నం చేస్తాం అన్నారు.

Exit mobile version