President Murmu Important Visit : రాష్ట్ర‌ప‌తి తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌పై స‌మీక్ష‌

ఈనెల 21న శ్రీ‌వారిని ద‌ర్శించుకోనున్న ముర్ము

Hello Telugu - President Murmu Important Visit

Hello Telugu - President Murmu Important Visit

President Murmu : తిరుమ‌ల : భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన తిరుమ‌ల‌ను ద‌ర్శించు కోనున్నారు. ఈ సంద‌ర్బంగా ముందే స‌మాచారం కేంద్ర స‌ర్కార్ తెలియ చేసింది. దీంతో టీటీడీ పాల‌క మండ‌లి అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి ఆధ్వ‌ర్యంలో కీల‌క స‌మావేశం నిర్వహించారు. ఈనెల 21వ తేదీన స్వామి వారిని ద‌ర్శించు కుంటార‌ని తెలిపారు. ద‌ర్శించుకునే కంటే ముందు రోజు న‌వంబ‌ర్ 20వ తేదీన తిరుప‌తికి చేరుకుంటార‌ని చెప్పారు. రెండు రోజుల పాటు రాష్ట్ర‌ప‌తి (President Murmu) తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ఉంటుంద‌న్నారు. ఇందులో భాగంగా మొద‌ట‌గా తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారిని ద‌ర్శించుకుంటార‌ని తెలిపారు.

President Murmu TTD Visit Plan

అమ్మ వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము తిరుమ‌ల‌కు చేరుకుంటార‌ని వెల్ల‌డించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన నిమిత్తం కావాల్సిన అన్ని ఏర్పాట్లపై తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో కీల‌క స‌మావేశం నిర్వహించారు. ఆయనతో పాటు సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు. రాష్ట్రపతి రెండు రోజుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి లోపం లేకుండా, పూర్తిస్థాయిలో, సమగ్ర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు అదనపు ఈవో సూచించారు . ఈ సమావేశంలో ఎస్వీబీసీ సీఈఓ ఫణికుమార్ నాయుడు, సిఈ సత్యనారాయణ, అదనపు ఎస్పీ రామ‌కృష్ణ‌, తదితర అధికారులు పాల్గొన్నారు.

Also Read : Jubilee Hills By Election Sensational : జూబ్లీ హిల్స్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఖ‌తం

Exit mobile version