Jubilee Hills : హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హస్తానికి ఝలక్ ఇవ్వక తప్పదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే 24 నెలల పాలనలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ రోడ్ షో చేపట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించాడని అన్నారు. అందుకే జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక తన పాలనకు రెఫరెండం కాదు అన్నాడని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్. రెండు సంవత్సరాల్లో జరిగిన అరాచకాన్ని, అంతకు ముందు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలోని వికాసాన్ని చూసి ఓటు వేయాలని కోరారు. హైడ్రా గురించి గొప్పగా చెబుతున్నా రేవంత్ రెడ్డికి దమ్ముంటే మంత్రుల అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
Jubilee Hills By Election Updates
రెండు సంవత్సరాల అరాచకాన్ని అవినీతిని తరిమి కొట్టాలంటే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించి తీరాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను 24 నెలలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు కేటీఆర్. కాంగ్రెస్‌ను ఓడగొడితేనే ఆరు గ్యారెంటీలు వస్తాయన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగళ్‌రావునగర్‌లో నిర్వహించిన రోడ్ షోకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. తాను చేసింది ఏమీ లేక పోవడంతోనే రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలకు పాల్పడుతున్నారని విమర్శించారు కేటీఆర్.
Also Read : TTD EO Anil Kumar Interesting Update : డిసెంబరు 30 నుండి వైకుంఠ ద్వార దర్శనం
