Prashant Kishor Fired on CM Revanth : రేవంత్ రెడ్డిని తరిమి కొట్ట‌డం ఖాయం : పీకే

ఆయ‌న‌కు బీహారీల గురించి మాట్లాడే అర్హ‌త లేదు

Hello Telugu - Prashant Kishor Fired on CM Revanth

Hello Telugu - Prashant Kishor Fired on CM Revanth

Prashant Kishor : ఢిల్లీ : ప్ర‌ముఖ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ , జ‌న సురాజ్ ఫౌండ‌ర్ ప్ర‌శాంత్ కిషోర్ (Prashant Kishor) షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఎన్నికల సమయంలో నన్ను గెలిపించమని రేవంత్ రెడ్డి నా సహాయం కోరాడని అన్నారు. అలాంటి వ్యక్తి మా బీహార్ ప్రజలు లేబర్స్‌గా పని చేయడానికే పనికొస్తారని అవమానించాడ‌ని మండిప‌డ్డారు. తెలంగాణ ప్రజల డీఎన్ఏ కన్నా.. బీహార్ ప్రజల డీఎన్ఏ చెత్తగా ఉంటుందని చెప్పుకొచ్చాడని ఫైర్ అయ్యారు. బీహారోళ్లను అవమానించే ధైర్యం అతనికి ఎక్కడిదని, రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆయ‌న ఇండియా టుడేతో ముచ్చ‌టించిన సంద‌ర్బంగా ప‌లు అంశాల‌పై స్పందించారు. ఇదే స‌మ‌యంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Prashant Kishor Slams CM Revanth Reddy

ఇదిలా ఉండ‌గా ఈ మొత్తం వ్య‌వ‌హారం ఇటీవ‌ల బీహార్ ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా రాహుల్ గాంధీతో క‌లిసి సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న నోరు పారేసుకున్నారు బీహారీల‌పై. కాంగ్రెస్ సీఎం అయినప్పటికీ, ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ ప‌క్క‌న రేవంత్ రెడ్డి ఉండటం కిషోర్ కు నచ్చలేదు. బీహార్ రాజకీయాల్లో ఆయన ఔచిత్యాన్ని బహిరంగంగానే ప్రశ్నించారు. రాజకీయ వ్యూహకర్తగా మారిన ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీ ఓటరు అధికార్ యాత్ర లేదా ఆయన ఓటు చోరీ ప్రచారానికి ఎటువంటి అభ్యంతరం చెప్పనప్పటికీ, రేవంత్ రెడ్డి గురించి ఆయన ముక్కుసూటిగా మాట్లాడారు.

బీహారీలు తమ DNAలోనే కార్మికులుగా ఉండే గుణం కలిగి ఉన్నారనే సీఎం వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. బీహార్‌లోని గ్రామాలకు రేవంత్ రెడ్డి వెళితే ప్రజలు తనను కొడతారని ప్ర‌శాంత్ కిషోర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి బీహార్ కోసం ఏం చేశారని అడిగారు. రాహుల్ గాంధీ ఇప్పటికీ రేవంత్ రెడ్డి పక్కన నిలబడాలని ఎంచుకుంటే అది ఆయన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. బీహార్ ప్రచారంలో రేవంత్ రెడ్డి పాత్ర పట్ల తన అసంతృప్తిని నొక్కి చెబుతూ తన వైఖరిని స్పష్టం చేశారు.

Also Read : PM Modi Important – Bhupen Hazarika : భూపేన్ హ‌జారికా శ‌త‌జ‌యంతుత్స‌వాలు

Exit mobile version