PM Modi Important – Bhupen Hazarika : భూపేన్ హ‌జారికా శ‌త‌జ‌యంతుత్స‌వాలు

హాజ‌ర‌వుతున్న ప్ర‌ధాన‌మంత్రి మోదీ

Bhupen Hazarika : అస్సాం : భూమి పుత్రుడిగా పేరు పొందిన ప్ర‌జా గాయ‌కుడు భూపేన్ హ‌జారికా శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌కు అస్సాం సిద్ద‌మ‌వుతోంది . ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తోంది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్ర‌త్యేక ఉత్స‌వాల‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతున్నారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. గాయ‌కుడిగా, క‌విగా, ర‌చ‌యిత‌గా, నిర్మాత‌గా , సాంస్కృతిక వార‌ధిగా, రాయ‌బారిగా ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందాడు భూపేన్ హ‌జారికా (Bhupen Hazarika). ఆయ‌న‌ను అంతా భూపేన్ దా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. అస్సాం రాష్ట్ర సాంస్కృతిక చిహ్నంగా పేరొందారు.

Bhupen Hazarika Centenary Celebrations

త‌న మ‌ర‌ణానంత‌రం భార‌త ప్ర‌భుత్వం అత్యున్న‌త‌మైన భార‌త ర‌త్న పుర‌స్కారాన్ని 2019లో అంద‌జేసింది కుటుంబీకుల‌కు. ఈ సంద‌ర్బంగా అస్సాం ముఖ్య‌మంత్రి హిమంత బిస్వా శ‌ర్మ భూపేన్ హ‌జారికాను స్మ‌రించుకున్నారు. ఆయ‌న త‌న‌కే కాదు , రాష్ట్రానికి , యావ‌త్ దేశానికి సాంస్కృతిక వార‌ధిగా ప‌ని చేశారంటూ కొనియాడారు. ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు అర్పించేందుకు గాను పెద్ద ఎత్తున శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న ర‌చ‌న‌లు ఎల్ల‌కాలం స్పూర్తి క‌లిగిస్తూనే ఉంటాయ‌ని పేర్కొన్నారు సీఎం. ఆయన జీవితం, కాలాలు ఒక ఉదాహరణ మాత్ర‌మే. ఆయ‌న‌కు ఈ ప్రాంత‌మ‌న్నా, భార‌త దేశ‌మ‌న్నా ఎన‌లేని ప్రేమ‌. మానవత్వం, సోదరభావం, సామాజిక న్యాయం గురించి ఆయన పాటలు ఉపఖండం అంతటా ప్రజాదరణ పొందాయి.

Also Read : Ray Dalio Warning on US Debt Burden : అమెరికా అప్పుల సమస్యపై హెజ్‌ ఫండ్‌ దిగ్గజం రే డాలియో హెచ్చరిక

Exit mobile version