Prashant Kishor Shocking Comments on Bihar : బీహార్ ఎన్నిక‌ల‌పై ప్ర‌శాంత్ కిషోర్ కామెంట్స్

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ప‌లు అనుమానాలు

Hello Telugu - Prashant Kishor Shocking Comments on Bihar

Hello Telugu - Prashant Kishor Shocking Comments on Bihar

Prashant Kishor : పాట్నా : బీహార్ రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిశాయి. ఎన్డీయే స‌ర్కార్ మ‌రోసారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. గ‌తంలో వ‌చ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు ద‌క్కాయి. దీనిపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే తేజ‌స్వి యాద‌వ్, రాహుల్ గాంధీతో పాటు జ‌న్ సురాజ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ (Prashant Kishor) స్పందించారు. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్‌లో 25 సంవత్సరాల క్రితం తన పార్టీని ప్రారంభించాడు, ఏడు స్థానాల నుండి పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ ఓడిపోయాడు . కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయడం ఆత్మాశ్రయమైనది. నేను ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ప్రయోజనకరంగా ఉండేదా లేదా అని ప్రజలు చర్చించుకోవచ్చు. నేను బీహార్‌ను అర్థం చేసుకోలేనని అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాన‌ని అన్నారు.

Prashant Kishor Shocking Comments on Bihar Election Results

లాలూ ప్ర‌సాద్ యాదవ్, సామ్రాట్ చౌదరి, అశోక్ చౌదరి లాగా కులం, మతం పేరుతో బీహార్‌ను ఎలా విభజించాలో నాకు అర్థం కాలేదని కూడా నేను అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు ప్ర‌శాంత్ కిషోర్. రాష్ట్రాన్ని మెరుగు పరచడానికి ప్రయత్నించడం నేరం కాదు, కానీ నేను నేరం చేసినట్లుగా ప్రజలు స్పందిస్తున్నారని వాపోయారు. మీరందరూ నా పోస్ట్‌మార్టం కోసం ఇక్కడ ఉన్నారని ఆ విష‌యం నాకు తెలుసు అని పేర్కొన్నారు. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జ‌రిగింద‌ని, అందు వ‌ల్ల‌నే పెద్ద ఎత్తున సీట్లు ఎన్డీయే కూట‌మికి వ‌చ్చాయ‌ని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.

Also Read : National Awards Interesting : జాతీయ స్థాయిలో తెలంగాణ‌కు అవార్డుల పంట

Exit mobile version