National Awards Interesting : జాతీయ స్థాయిలో తెలంగాణ‌కు అవార్డుల పంట

ఆరు పుర‌స్కారాల‌ను స్వంతం చేసుకున్న రాష్ట్రం

Hello Telugu - National Awards Interesting

Hello Telugu - National Awards Interesting

National Awards : న్యూఢిల్లీ : తెలంగాణ స‌ర్కార్ కు జాతీయ స్థాయిలో ప‌లు అవార్డులు (National Awards) ద‌క్కాయి. ఏకంగా ఆరు జాతీయ పుర‌స్కారాల‌ను కైవ‌సం చేసుకుంది. ‘జల్ సంచయ్ – జన్ భగీదారి’ విభాగంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జాతీయ స్థాయిలో టాప్ 3 ర్యాంకులను దక్కించుకున్నాయి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల పురస్కారాలు – 2024లో జల్ సంచయ్ – జన్ భగీదారి (నీటి సంరక్షణ – ప్రజా భాగస్వామ్యం) విభాగంలో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా అవతరించింది. 2024లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ జాతీయ చొరవ కింద 5,20,362 జల సంరక్షణ పనులను పూర్తి చేయడం ద్వారా తెలంగాణ దేశంలోనే నంబర్ 1 ర్యాంక్‌ను సాధించింది.

National Awards Telangana Gets 6 Awards

జల సంచయ్ – జన్ భగీదారి కార్యక్రమంలో అత్యుత్తమ పనితీరును ప్రదర్శించిన రాష్ట్రాలు, జిల్లాలు , సంస్థలకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో 3 రాష్ట్రాలు, 67 జిల్లాలు, 6 మునిసిపల్ కార్పొరేషన్లు, 1 పట్టణ స్థానిక సంస్థ, 2 భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు, విభాగాలు, 2 పరిశ్రమలు, 3 స్వ‌చ్చంధ సంస్థ‌లు, 2 దాతలు 14 నోడల్ అధికారులు సహా వివిధ విభాగాలలో మొత్తం 100 అవార్డులు ప్రకటించారు. నీటి సంరక్షణలో వ్యక్తులు, సంఘాలు, కార్పొరేట్‌ల సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది.

Also Read : Venkaiah Naidu Interesting Comments : శ్రీ స‌త్య‌సాయి బాబా వ్య‌క్తి కాదు ఓ శ‌క్తి

Exit mobile version