Prashant Kishor Sensational Comments : నా ఆస్తుల‌న్నీ బీహర్ ప్ర‌జ‌ల కోస‌మే : ప్ర‌శాంత్ కిషోర్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన జ‌న్ సురాజ్ పార్టీ అధ్య‌క్షుడు

Hello Telugu - Prashant Kishor Sensational Comments

Hello Telugu - Prashant Kishor Sensational Comments

Prashant Kishor : ప‌శ్చిమ చంపార‌న్ : ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని, సీట్లు రాక పోవ‌డం ప‌ట్ల తాము ఎలాంటి బాధ‌కు గురి కావ‌డం లేద‌న్నారు. శ‌నివారం ఆయ‌న బీహార్ లో జ‌రిగిన ఎన్నిక‌లు, ఫ‌లితాల‌పై స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీతో తాను కూడా ఏకీభ‌విస్తున్నాన‌ని అన్నారు. ఎన్నిక‌ల కంటే ముందు అధికారంలో ఉన్న నితీశ్ కుమార్ భారీ ఎత్తున ప్ర‌లోభాలకు గురి చేసింద‌ని ఆరోపించారు. ప్ర‌తి ఒక్క‌రి ఖాతాలో రూ. 10 వేలు జ‌మ చేశార‌ని, దీని వ‌ల్ల మ‌హిళ‌లు ఎక్కవ‌గా ఓట్లు వారికి వేశార‌ని వాపోయారు. అయితే తాము ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేస్తూనే ఉంటామ‌ని ప్ర‌క‌టించారు.

Prashant Kishor Comments Viral

ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేద‌ని అన్నారు ప్ర‌శాంత్ కిషోర్ (Prashant Kishor). మొదటి విడతగా రూ. 10,000 ఇవ్వబడిందో వారంద‌రి ఇళ్ల‌కు చేరుకుంటామ‌ని, ఇస్తే ప‌ర్వాలేదు. కానీ అందుకోని వారిని త‌ప్ప‌కుండా అందేలా చేస్తామ‌న్నారు పీకే.. జనవరి 15 తర్వాత‌ మేము ప్రతి ఇంటికి వెళ్లి, వారికి రూ. 2 లక్షలు అందేలా ఫారమ్ నింపేలా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు . ఈ బీహార్ నవనిర్మాణ్ సంకల్ప్ అభియాన్ ప్రారంభించడం జ‌రుగుతుంద‌న్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో నేను సంపాదించే దానిలో కనీసం 90% జన్ సురాజ్ విరాళంగా ఇస్తానని బీహార్ ప్రజలకు నేను హామీ ఇస్తున్నానని ప్ర‌క‌టించారు ప్ర‌శాంత్ కిషోర్. అలాగే ఢిల్లీలో నా కుటుంబం కోసం ఒక ఇల్లు తప్ప, గత 20 సంవత్సరాలలో సంపాదించిన నా ఆస్తులన్నింటినీ ఈ చొరవకు విరాళంగా ఇస్తున్నాన‌ని తెలిపారు.

Also Read : CM Siddaramaiah Fired on Union Govt : మొక్క‌జొన్న రైతుల‌ను ఆదుకుంటాం : సీఎం

Exit mobile version