CM Siddaramaiah Fired on Union Govt : మొక్క‌జొన్న రైతుల‌ను ఆదుకుంటాం : సీఎం

కేంద్ర స‌ర్కార్ నిర్వాకంపై సిద్ద‌రామ‌య్య ఫైర్

Hello Telugu - CM Siddaramaiah Fired on Union Govt

Hello Telugu - CM Siddaramaiah Fired on Union Govt

CM Siddaramaiah : బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఉత్తర కర్ణాటకలో మొక్కజొన్న రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరవాలని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. రైతుల ఆందోళనలను వ్యక్తిగతంగా సమీక్షించడానికి గాను ప్ర‌త్యేకంగా స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు సీఎం. రైతులు ఎదుర్కొంటున్న బాధ తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. అత్యవసరంగా, స్పష్టతతో, కరుణతో స్పందించడం మా బాధ్య‌త అని స్ప‌ష్టం చేశారు. రైతులు లేవ‌నెత్తిన స‌మ‌స్య‌ల‌పై తన‌కు పూర్తి అవ‌గాహ‌న ఉంద‌న్నారు సీఎం (CM Siddaramaiah). కర్ణాటక తో పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాలలో మొక్కజొన్న ఉత్పత్తి భారీగా పెరిగింద‌ని చెప్పారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 70 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను దిగుమతి చేసుకుందని తెలిపారు.

CM Siddaramaiah Slams Union Govt

ఇది దేశ వ్యాప్తంగా రైతులపై తీవ్ర భారాన్ని మోపింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సిద్ద‌రామ‌య్య‌. మొక్క జొన్న నుండి ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి కర్ణాటకకు కేటాయించిన కోటా చాలా తక్కువగా ఉందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీని ఫలితంగా డిస్టిలరీల ద్వారా సేకరణ తగ్గింద‌న్నారు. నోడల్ ఏజెన్సీల నిబంధనలను పాటించక పోవడం కూడా ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే NAFED/NCCF ద్వారా MSP పథకం కింద సేకరణకు, ఇథనాల్ ఉత్పత్తిలో మొక్కజొన్నను ఉపయోగించడం కోసం మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు సిద్ద‌రామ‌య్య‌. అయితే ఈ ఏజెన్సీలు ఇంకా మార్గదర్శకాల ప్రకారం సేకరణను ప్రారంభించ లేద‌న్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వాపోయారు. వారికి భ‌రోసా ఇచ్చేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు.

Also Read : MP Eatala Rajender Important Update : నాగ‌ర్ కర్నూల్ నుంచి నంద్యాల‌కు వంతెన‌

Exit mobile version