17 న పబ్లిక్ గార్డెన్ లో ప్రజా పాలనా దినోత్సవం

వెల్ల‌డించిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జాజు

helloteugu-CS

హైదరాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇదిలా ఉండ‌గా సెప్టెంబ‌ర్ 17 వతేదీన నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్ లో తెలంగాణా ప్రజా పాలన దినోత్సవం నిర్విహిస్తున్న‌ట్లు తెలిపారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు. ఈ సంద‌ర్బంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. ప్రజాపాలన దినోత్సవం నిర్వహణా ఏర్పాట్లపై డా.బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, అహ్మద్ నదీమ్, ముఖ్య కార్యదర్శులు నవీన్ మిట్టల్, క్రిస్టినా చొంగ్తూ, శిఖా గోయల్, హైదాబాద్ సి.పీ సజ్జనార్, ఆర్టీసీ ఎండి నాగి రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి తదితర సీనియర్ అధికారులు హాజయ్యారు.

ఈ సందర్భంగా సి.ఎస్ సంజ‌య్ జాజు మాట్లాడారు. ప్రజా పాలనా దినోత్సవాన్ని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 17 న ఉదయం అసెంబ్లీ ఎదురుగా గల అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పిస్తార‌ని పేర్కొన్నారు. అనంతరం పబ్లిక్ గార్డెన్ కు వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపంవద్ద, పబ్లిక్ గార్డెన్ లో సంబంధిత అధికారులు తగు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని పలు ప్రధాన భవనాలకు , చారిత్రక కట్టడాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టాలని స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణ కు గానూ ఈనెల 15 న పూర్తి డ్రెస్ రిహార్సల్స్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రజాపాలన దినోత్సవానికి వేయి మంది స్వయం సహాయక మహిళలతో పాటు రెండు వేల మంది హాజరవుతారని పేర్కొన్నారు.

Exit mobile version