హైదరాబాద్ : పీపుల్స్ మీడియా సంస్థ అధినేత టీజీ విశ్వ ప్రసాద్, కీర్తి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ది రాజా సాబ్. దీనికి మారుతి దర్శకత్వం వహించాడు. పూర్తిగా కామెడి, రొమాంటిక్ ,హారర్ నేపథ్యంతో తీసిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాలేదు. అభిమానులను పూర్తిగా నిరాశ పర్చడం పట్ల తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు దర్శకుడు . బాగా లేక పోతే తన ఇంటికి రావాలని కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా ప్రకటించాడు వేదికగా. కానీ ఆశించిన స్థాయిలో లేక పోవడంతో ఫ్యాన్స్ తిట్టిన తిట్లు తిడుతున్నారు. అవసరమైతే ప్రభాస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసినందుకు దాడులు చేస్తామంటూ కూడా హెచ్చరించారు. దీంతో తను సెక్యూరిటీని కూడా పెట్టు కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉండగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఆశించిన స్తాయిలో వసూళ్లు రాబట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. లాభాలు రాక పోయినా కనీసం పెట్టిన పెట్టుబడి అయినా వస్తే బాగుంటుందని నిర్మాత , డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నారు. తొలి రోజు రూ. 9 కోట్లు వసూలు చేయగా రెండో రోజు రూ. 7 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా చూస్తే రూ. 35 కోట్లు వరల్డ్ వైడ్ గా వసూలైనట్లు తాజా గా అందిన సమాచారం. పండుగ సెలవులు ఉన్నప్పటికీ ప్రభాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఇబ్బంది పడుతున్నారు . తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ చివరి పెద్ద హిట్ ‘కల్కి 2898 AD’, కాగా, ‘కన్నప్ప’ చిత్రంలో అతని అతిధి పాత్ర కొంత బజ్‌ను సృష్టించినప్పటికీ, వసూళ్లను మాత్రం తీసుకు రాలేక పోయింది.
