Hero Dulquer Salmaan-Pooja Hegde : దుల్క‌ర్ స‌ల్మాన్ తో జ‌త‌క‌ట్టిన ముద్దుగుమ్మ‌

పాన్ ఇండియా మూవీలో న‌టి కీల‌క పాత్ర

Hello Telugu - Hero Dulquer Salmaan-Pooja Hegde

Hello Telugu - Hero Dulquer Salmaan-Pooja Hegde

Dulquer Salmaan : అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే సంచ‌ల‌నంగా మారింది. ఇటీవ‌లే త‌ను కీ రోల్ పోషించింది సూప‌ర్ స్టార్ త‌లైవా ర‌జ‌నీకాంత్ ముఖ్య పాత్ర‌లో న‌టించిన కూలీ మూవీలో న‌టించింది. దీనికి లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ల‌వ్ యూ మోనికా అనే స్పెష‌ల్ సాంగ్ లో త‌ళుక్కున మెరిసింది. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇప్ప‌టికీ ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. ఇందులో మ‌ల‌యాళ సినీ స్టార్ సోబేర్ త‌న‌తో పోటీగా న‌టించాడు. త‌న వ‌య‌సు 50 ఏళ్ల‌కు పైగానే. ఇక కూలీలో న‌టించిన వారంతా హాఫ్ సెంచ‌రీ దాటిన వాళ్లే కావ‌డం విశేషం. ఇది ప‌క్క‌న పెడితే తాజాగా పూజా హెగ్డే నుంచి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది.

Dulquer Salmaan-Pooja Hegde Movie Updates

త‌ను మ‌రో మ‌ల‌యాళ సూప‌ర్ హీరో గా పేరు పొందిన దుల్క‌ర్ స‌ల్మాన్ (Dulquer Salmaan) తో క‌లిసి కొత్త చిత్రంలో న‌టించ బోతోంది. ఈ విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దీనికి డీక్యూ 41 అని పేరు పెట్టారు. ఎస్ఎల్వీ సినిమాస్ పాన్ ఇండియా ఫిల్మ్ సార‌థ్యంలో సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. విచిత్రం ఏమిట‌టే దుల్క‌ర్ స‌ల్మాన్ కు ఈ సినిమా 41వ‌ది కావ‌డం విశేషం. ఈ మూవీ ద్వారా ర‌వి నేల‌కుడేటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర వేగంగా హైద‌రాబాద్ లో కొన‌సాగుతోంది. త‌న‌తో క‌లిసి పూజా హెగ్డే న‌టిస్తోంద‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు నిర్మాత సుధాక‌ర్. ఇదిలా ఉండ‌గా షూటింగ్ ప్రారంభ‌మైన దాని గురించి ప్ర‌త్యేకంగా వీడియోను విడుద‌ల చేశారు. ఇందులో పూజా స్కూటీ న‌డుపుతుండ‌గా వెనుక కూర్చున్నారు దుల్క‌ర్ స‌ల్మాన్.

Also Read : Hero Rajinikanth Coolie OTT : ఓటీటీలో ర‌జ‌నీకాంత్ కూలీ రెడీ

Exit mobile version