Coolie : దమ్మున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం కూలీ (Coolie). ప్రపంచ వ్యాప్తంగా విడుదలై దుమ్ము రేపింది. ఇందులో స్టార్ హీరోలు కీ రోల్స్ పోషించారు. ప్రత్యేకించి కొందరు హీరోలంతా 50 ఏళ్లకు పైబడిన వారే కావడం విశేషం. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. సన్ పిక్చర్స్ భారీ హంగులతో నిర్మించింది. అంతకు మించి ఎక్కువగా డబ్బులు వసూలు చేసింది కూలీ చిత్రం. ఇందులో ప్రత్యేకంగా ముఖ్య భూమిక పోషించారు. ఆయనతో పాటు సత్య రాజ్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సోబేన్ తో పాటు తళుక్కున మెరిసింది ముద్దుగుమ్మ పూజా హెగ్డే. స్పెషల్ సాంగ్ లో కెవ్వు కేక అనిపించేలా చేసింది. ఐ లవ్ యూ మోనికా పేరుతో రిలీజ్ అయిన ఈ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. టాప్ లో నిలిచింది.
Coolie Movie OTT Updates
మొత్తంగా రజనీకాంత్ సినీ కెరీర్ లో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. అయితే మూవీ మేకర్స్ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వచ్చాయనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఓటీటీ లవర్స్ కోసం సెప్టెంబర్ 11న గురువారం ఓటీటీ ప్లాట్ ఫారమ్ వేదికగా స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతోంది. దీనిని భారీ ధరకు కొనుగోలు చేసింది ప్రైమ్ వీడియో. తమిళ సినీ రంగానికి చెందిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా దమ్మున్న దర్శకుడిగా పేరు పొందిన లోకేష్ కనగరాజ్ సంచలన కామెంట్ చేశాడు. సినిమా రిలీజ్ కంటే ముందే ఇది పక్కాగా సక్సెస్ అవుతుందని ప్రకటించాడు. తను చెప్పినట్టుగానే కూలీని సక్సెస్ చేసి చూపించాడు.
Also Read : Mallikarjun Kharge Fired on Modi Govt : మోదీ..అమిత్ షా ప్రజాస్వామ్యానికి పాతర : ఖర్గే
