Minister Ponnam Prabhakar Clear Instructions : ప‌ల్లె ప‌ల్లెనా సంబురాలు నిర్వ‌హించండి

పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చిన పొన్నం ప్ర‌భాక‌ర్

Hello Telugu - Minister Ponnam Prabhakar Clear Instructions

Hello Telugu - Minister Ponnam Prabhakar Clear Instructions

Ponnam Prabhakar : హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపొందింది. త‌మ పార్టీ త‌ర‌పున బ‌రిలో నిలిచిన ప‌ల్లాల న‌వీన్ యాద‌వ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. త‌న స‌మీప అభ్య‌ర్థి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీత‌పై 25 వేల 658 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. ఈ ఉప ఎన్నిక‌ల‌కు ఇంఛార్జ్ గా ఉన్నారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ (Ponnam Prabhakar). గెలుపొంద‌డంతో సంబురాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేష‌న్ చైర్మ‌న్లు, బోర్డు మెంబ‌ర్లు ఇలా ప్ర‌తి ఒక్క‌రు జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేప‌ట్టారు. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా , ఛాలెంజ్ గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి.

Minister Ponnam Prabhakar Key Comments

త‌మ పార్టీ విజ‌యం సాధించ‌డం ప‌ట్ల , న‌వీన్ గెలుపు పొంద‌డంతో స్పందించారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ను గ్రామగ్రామాన సంబరాలు నిర్వహించాల‌ని పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ క‌లిసి త‌మ స‌ర్కార్ ను బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నం చేశారని పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ ఆరోపించారు. అయినా ప్ర‌జ‌లు న‌మ్మ‌లేద‌ని, ప్ర‌జాపాల‌న‌కు ప‌ట్టం క‌ట్టార‌ని చెప్పారు.

Also Read : Jubilee Hills By Election Sensational : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ దే విక్ట‌రీ

Exit mobile version